రిషబ్ పంత్” అంతర్జాతీయ క్రికెట్ లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ పొట్టి ప్లేయర్ గేమ్ కు ప్రత్యర్ధి ఆటగాళ్ళు సైతం ఫిదా అయిపోతూ ఉంటారు. ఎవరికి భయపడని నైజం, ప్రత్యేకంగా టెస్ట్ క్రికెట్ లో బౌలర్ ను ఓ ఆట ఆడుకోవడం, ఫీల్డర్ లను వణికించడం అతని శైలి. ముఖ్యంగా విదేశాల్లో ఆడుతున్నప్పుడు పంత్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. వికెట్ కీపర్ గా కూడా అతని ఆట ఎంతో అద్భుతంగా ఉంటుంది. భారత్ కు సిడ్నీ లాంటి చిరస్మరణీయ విజయాలను అందించాడు.
Also Read : ఉపరాష్ట్రపతి ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కష్టాలు
అలాంటి పంత్ ను కెప్టెన్ గా ఎంపిక చేయకపోవడం ఓ సంచలనం అయింది. గిల్ కంటే సీనియర్ అయిన పంత్ ను ఎందుకు వైస్ కెప్టెన్ చేసారు అనే దానిపై అభిమానులు బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు దాని వెనుక ఏం జరిగింది..? పంత్ లాంటి ఆటగాడిని టెస్ట్ కెప్టెన్ గా ఎందుకు ఎంపిక చేయలేదు..? దీనిపై ఓ సంచలన విషయం బయటపెట్టాడు మాజీ ఆటగాడు విక్రాంత్ గుప్తా. కెప్టెన్ ఎంపిక కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పలువురు ఆటగాళ్ళ పేర్లను పరిశీలించింది.
Also Read : తమిళ ప్రజలు బుట్టలో పడతారా..?
అందులో పంత్ మొదటి ఆటగాడు. పంత్ ను సెలెక్టర్ లు సంప్రదించి.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను జట్టు నుంచి బయటకు పంపే అంశంలో ఓకే చెప్తే.. కెప్టెన్సి బాధ్యతలు ఇస్తామని అడిగారట. కానీ.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ జట్టులో ఉంటేనే తనకు కెప్టెన్సీ కావాలని పంత్ స్పష్టంగా చెప్పాడట. అదే విషయాన్ని గిల్ ను అడిగితే అతను బోర్డు పెద్దల కండీషన్ కు ఓకే చెప్పడంతో అతనిని టెస్ట్ కెప్టెన్ గా ఎంపిక చేసారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా కోహ్లీ కెప్టెన్సీ లోనే పంత్ టెస్ట్ క్రికెట్ లో కీలక ఆటగాడిగా మారాడు.