దేశంలో రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి విషయంలో ఎన్డీఏ సర్కార్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎలాగైనా సరే పోటీ లేకుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో అత్యంత కీలకంగా ఉండే ఉపరాష్ట్రపతి.. అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. ఇక అక్కడ నుంచి ఎన్డీఏ కి పోటీగా ఇండియా కూటమి ఎవరిని నిలబెడుతుంది అనేదానిపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇండియా కూటమి కూడా దక్షిణాదికి చెందిన వ్యక్తికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
Also Read : వరుస వివాదాల్లో టీడీపీ నేతలు..!
అయితే ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసినందుకు ఎన్డీఏ తీవ్రంగా కష్టపడుతోంది. విపక్షాలతో కేంద్ర మంత్రులు వరుసగా భేటీ అవుతున్నారు. ఎలాగైనా సరే అభ్యర్థిని నిలబెట్టాలని పట్టుదలగా ఉన్న ఇండియా కూటమికి బ్రేకులు వేసే దిశగా జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో బిజెపి ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సైతం బిజెపి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Also Read : రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి.. డైరెక్ట్ గా రేవంత్ పేరే వాడుతూ..!
అయితే రాహుల్ గాంధీ మాత్రం ఎలాగైనా సరే ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. సోనియాగాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు కేంద్రంతో ఢీకొడుతూనే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో రాజీ పడితే ప్రజల్లో చులకన అవుతాము అనే భావనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ గెలవడం ఖాయం అయినా సరే ఈ ఎన్నిక ద్వారా తమ సత్తా ఏంటో చూపించడానికి ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.