సాధారణంగా క్రీడలు అనగానే ఏదో ఒక రాజకీయం అంతర్గతంగా జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో చాలామంది ఆటగాళ్లు ఇబ్బంది పడుతూనే ఉంటారు. స్టార్ ఆటగాళ్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏం కాదు. ముఖ్యంగా భారత్ లో అత్యంత ప్రభావం చూపే క్రికెట్లో ఈ రాజకీయాలు ఎక్కువ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని ఇటీవల ఓ మాజీ ఆటగాడు కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read : కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న జీఎస్టీ..?
ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారం టెస్ట్ కెప్టెన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గిల్ కూడా ఈ రాజకీయాలతో ఇబ్బంది పడుతున్నట్లే అర్థమవుతుంది. భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ కావాలని భావించిన గిల్ ఇప్పుడు టి20లో తిరిగి అడుగు పెట్టడం కూడా కష్టంగానే మారింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్ లో మెరుగ్గా రాణించిన గిల్ ఆసియా కప్ కోసం టి20 జట్టులో చేరే అవకాశం ఉందని భావించారు. అతన్ని వైస్ కెప్టెన్ గా కూడా ఎంపిక చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ టీం యాజమాన్యం మాత్రం గిల్ టి20 లో తిరిగి అడుగు పెట్టేందుకు అంత సుముఖంగా లేదు అనే వార్త ఇప్పుడు జాతీయ మీడియాలో కనబడటం అతని ఫాన్స్ కు షాక్ ఇచ్చింది.
Also Read : ‘వార్ 2’ లో ఎన్టీఆర్ విలనిజం పండలేదా..?
తిలక్ వర్మను తప్పించి గిల్ కు జట్టులో చోటు కల్పించాలని ముందు భావించారట. ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఒత్తిడి చేయడంతో సెలెక్టర్లు ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని.. ముందు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో జట్టు యాజమాన్యం ఎంత మాత్రం సుముఖంగా లేదు అంటుంది జాతీయ మీడియా. నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మను తప్పించడం ఏమాత్రం టీం యాజమాన్యానికి ఇష్టం లేదని.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడంతో అతను ఆసియా కప్ లో అత్యంత కీలకంగా రాణిస్తాడని భావిస్తోంది. అవసరమైతే బౌలింగ్ కూడా చేయగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు తిలక్ వర్మ. దీనితోనే జట్టు యాజమాన్యం ఎవరి మాట వినడం లేదని సమాచారం. ఇదే విషయాన్ని సెలెక్టర్లకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా ఒక తెలుగు ఆటగాడిని తప్పించడం కోసం అంతర్గతంగా జరిగిన వ్యవహారాలు.. కాస్త ఆశ్చర్యమే.