Monday, October 20, 2025 12:24 PM
Monday, October 20, 2025 12:24 PM
roots

వినాయక చవితికి నందమూరి ఫ్యాన్స్‌కు గిఫ్ట్ రెడీ..?

టాలీవుడ్ లో నందమూరి ఫ్యాన్స్ ఓ వారసుడి ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడని ఏడాది క్రితం వార్తలు వచ్చాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అతను ఒక సినిమా చేస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని.. రెండు మూడు నెలల్లో కొత్త అప్డేట్స్ వస్తాయని అప్పట్లో ప్రచారం జరిగింది.

Also Read : వరుస వివాదాల్లో టీడీపీ నేతలు..!

కానీ సినిమా ఆగిపోయింది అనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్టుగా.. సినిమా ఆగిపోలేదని అవసరమైన టైంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయని అనౌన్స్ చేశాడు. కానీ మళ్లీ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు రాలేదు. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించాడు. గతంలో లావుగా కనపడిన మోక్షజ్ఞ ఇప్పుడు స్లిమ్ గా కనబడటంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి.. డైరెక్ట్ గా రేవంత్ పేరే వాడుతూ..!

దీనితో సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయిందని.. అందుకే మోక్షజ్ఞ కొత్త లుక్ లో కనపడుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ కాదని ఇప్పుడు.. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా చేస్తున్నాడని ఈ సినిమాలో బాలయ్య కూడా నటిస్తున్నారంటూ ఓ ప్రచారం జరుగుతుంది. సినిమా ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని, వినాయక చవితికి నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్తారంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాను స్వయంగా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా నందమూరి వారసుడు ఎంట్రీ మాత్రం.. టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్