Friday, September 12, 2025 02:58 PM
Friday, September 12, 2025 02:58 PM
roots

కోచ్ పై అసహనంగా ఆటగాళ్ళు..?

టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ విషయంలో ఆటగాళ్ళు సీరియస్ గా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గంభీర్ కోచ్ గా మారిన తర్వాత జట్టు ప్రదర్శన రోజు రోజుకు దారుణంగా మారుతోంది. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సీరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో విజయాలు మినహా కీలకమైన టెస్ట్ సీరీస్ లు భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పదేళ్ళ తర్వాత ఓడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read : ఏం చేసుకుంటావో చేసుకో.. ట్రంప్ కు మస్క్ వార్నింగ్

ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ ఓటమి సైతం అభిమానులకు నచ్చడం లేదు. ఇది ఖచ్చితంగా బౌలింగ్ వైఫల్యంగానే చెప్పాలి. ఇదిలా ఉంచితే.. గంభీర్ కారణంగానే ఈ పరిస్థితి అనే భావనలో అభిమానులతో పాటుగా ఆటగాళ్ళు కూడా ఉన్నారు అంటుంది జాతీయ మీడియా. దీనిపై ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. ద్రావిడ్ కోచ్ గా తప్పుకున్న తర్వాత.. దక్షిణాదికి చెందిన ఓ మాజీ ఆటగాడు కోచ్ గా రావాలని కోరుకున్నారట ఆటగాళ్ళు. కాని గంభీర్ ను అప్పటికే బోర్డు పెద్దలు ఎంపిక చేసారట.

Also Read : గంభీర్ కు గుడ్ బై చెప్పేస్తున్న బోర్డ్..?

ఇక గంభీర్ నిర్ణయాలను సెలెక్టర్ లు సైతం వ్యతిరేకించడం ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలైందట. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు, రిషబ్ పంత్ తుది జట్టులో లేకపోవడం వంటి అంశాలపై అసహనం వ్యక్తం చేసారట. ఇక గిల్ ను కెప్టెన్ చేయడం ద్వారా జట్టుపై పట్టు పెంచుకోవచ్చని, యువ ఆటగాళ్లను దారిలోకి తెచ్చుకోవచ్చని గంభీర్ భావించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్ళు గంభీర్ ప్రస్తుతం కోచ్ గా వ్యతిరేకిస్తున్నారనేది జాతీయ మీడియా కథనంలోని అభిప్రాయం. మరి ఆటగాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని కోచ్ ని మారుస్తారా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్