టెస్ట్ క్రికెట్ లో గాని ఇతర ఫార్మేట్లలో గాని ఒక వెలుగు వెలిగిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు క్రమంగా పతనం అవుతుంది. అగ్ర జట్ల మీద సంచలన విజయాలు నమోదు చేసిన భారత జట్టు ఇప్పుడు చిన్న జట్ల మీద కూడా విజయం సాధించడానికి తీవ్రంగా కష్టపడుతోంది. స్వదేశంలో కూడా గెలవాల్సిన మ్యాచ్ లను చేజార్చుకుంటుంది. గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశంలో వైట్ వాష్ కు గురికావడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read : మళ్లీ అదే పాట.. అదే మాట.. మార్పు రాలేదా..?
వాస్తవానికి భారత జట్టుతో పోలిస్తే న్యూజిలాండ్ జట్టుకు అంత సమర్థవంతమైన బ్యాటింగ్ గాని బౌలింగ్ లైనప్ గాని లేదు. అలాంటి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడాన్ని ఇప్పటికీ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూనే ఉంటారు. అంతకుముందే శ్రీలంక చేతిలో 3 వన్డేల సిరీస్ ఓడిపోయింది భారత జట్టు. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో 3 – 1 తేడాతో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత చాంపియన్ ట్రోఫీ లో భారత్ విజయం సాధించిన సరే.. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన విధానం అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. బౌలింగ్ విభాగం అలాగే ఫీల్డింగ్ భారత్ కొంపముంచాయి.
Also Read : బూమ్రా లేకపోతే ఇండియాకు సీన్ లేదా..?
అయితే ఈ ఓటములకు ప్రధాన కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనేది అభిమానుల ఆవేదన. తనతో సన్నిహితంగా ఉండే ఆటగాళ్ళను జట్టులో ఎంపిక చేయడంతో జట్టు ప్రదర్శన రోజురోజుకీ తీసి కట్టుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా సీరియస్ గా ఉందనేది ప్రస్తుతం వినపడుతున్న మాట. ఒకవేళ ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ గనుక భారత్ ఓడిపోతే ఏది ఏమైనా సరే గంభీర్ ను పక్కన పెట్టేందుకు బోర్డు పెద్దలు సిద్ధమైనట్లు సమాచారం. ఈనెల 27న దీనిపై బోర్డులోని కీలక వ్యక్తులు సమావేశమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. గంభీర్ విషయంలో ఆటగాళ్లు కూడా సానుకూలంగా లేరని.. సీనియర్ ఆటగాళ్లు గంభీర్ ను వ్యతిరేకిస్తున్నారని జాతీయ మీడియా అభిప్రాయబడింది. టెస్ట్ సిరీస్ తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుని.. గంభీర్ ను కొనసాగించాలా వద్దా అనేదానిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.