“చంద్రబాబు కన్నా గ్లామరస్‌గా ఉన్నాడు.. లోకేష్ కన్నా గ్లామర్‌గా ఉన్నాడు.. అందుకని కొడాలి నానిని చూసినా.. ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశం.. వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా చక్కగా ఉంటారు కాబట్టి.. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు.. ఎందుకంటే లోకేష్ కంటే చక్కగా ఉన్నాడు కాబట్టి.. ఇది చంద్రబాబు నాయుడు మనస్తత్వం.” ఇలా గ్లామర్ గురించి మాట్లాడింది ఎవరో కాదు.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందంగా ఎవరున్నా చంద్రబాబు తట్టుకోలేడని.. అందుకే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్. చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ విచిత్రమైన ఆరోపణలు చేశారు జగన్.
Also Read : రాజకీయ అనాధలకు బిజెపి ఆశ్రయం
గన్నవరం పార్టీ కార్యాలయంలో దాడి కేసులో కీలక ముద్దాయిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడు. అయితే ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ కార్యాలయం ఉద్యోగిని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్.. ఆ తర్వాత గ్లామర్ గురించి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అంతా షాక్ అయ్యారు. అలాగే గతంలో పార్టీ మారిన తర్వాత వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు వయసు గురించి, లోకేష్ శరీరాకృతి పైనా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ముసలోడు అంటూ చంద్రబాబును, పప్పు అంటూ లోకేష్‌పైన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : హైదరాబాద్ వాసులకు పొంచి ఉన్న ప్రమాదం…!
అయితే నెల రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ అసలు రూపం ఇప్పుడు బయట పడటంతో అంతా అవాక్కవుతున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు… తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వంశీని చూసిన వారంతా షాక్ అయ్యారు. అసలు ఇతను వంశీనేనా అని ఒకటికి రెండు సార్లు పరీక్షించారు కూడా. తెల్ల జుట్టు, ముడతల ముఖం, మాసిన గడ్డం చూసి.. ఇంతకాలం మేకప్ వేసి కవర్ చేశాడా అని సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా ఆరోగ్యం సరిగ్గా లేదని కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఇక అరెస్టు సమయంలో కూడా.. తనకు అనారోగ్య సమస్యలున్నాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వంశీ అసలు రూపంపై సెటైర్లు వేస్తున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఇప్పటికీ రోజుకు 16-18 గంటలు పని చేస్తున్నారని.. ఆయన ఆరోగ్యంపై గతంలో వ్యాఖ్యలు చేసిన వంశీ నిజస్వరూపం ఇదా అంటూ విమర్శలు చేస్తున్నారు.