Tuesday, October 21, 2025 11:02 AM
Tuesday, October 21, 2025 11:02 AM
roots

పార్లమెంట్ లో తీగ లాగితే ఆంధ్రప్రదేశ్ లో డొంక కదులుతోంది –

ేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన ఘటనకు సరిగ్గా 22 ఏళ్లు నిండిన రోజునే మరోసారి దాడి జరగడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈసారి ఏకంగా లోక్ సభ సమావేశ హాలులోకే ఇద్దరు ప్రవేశించడం కలవరం పుట్టించింది. ఈ ఘటనలో నిందితులు పట్టుబడ్డారు. బీజేపీకే చెందిన ఎంపీ ప్రతాప్ సిన్హా సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టి అక్కడి నుంచి సభలో ప్రవేశించడంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు నిందితులు ఎటువంటి ప్రమాదకర ఆయుధాలు ప్రదర్శించకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికి అంతా ఊపిరిపీల్చుకున్నారు.

డిల్లీలో జరిగిన ఘటనపై నిందితులను భద్రతా బలగాలు ప్రశ్నిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నాయి. అదే సమయంలో ఈ ఘటన ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. వివిద రాష్ట్రాల నుంచి విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టిన వారి వివరాలు సేకరించే పనిలో నిఘా వర్గాలు పడ్డాయి. ఈ వివరాలు ఆరా తీస్తే ఏపీలో ఓ ఆసక్తికర వ్యవహారం బయటపడింది. ఏకంగా రౌడీ షీటర్ ఒకరు సభలో ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం.

జన్మభూమి పత్రికకు అందిన సమాచారం మేరకు పార్లమెంట్ పాసులు సంతల్లో సరుకుల్లా అమ్మకాలు జరుగుతున్నాయనే అనుమానాలను పెంచుతున్నాయి. తన సిఫార్సుతో ఎవరు సభలో అడుగుపెడుతున్నారనే అంశం సదరు సభ్యుడికి తెలియకపోయినా, పాసులు మంజూరు అవుతున్నట్టు తాజా ఘటనలో బయటపడింది. ఆ కోవలోనే ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ రౌడీ షీటర్ కూడా అలాంటి పాసుల ద్వారానే సభలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

భారత అత్యున్నత చట్టసభల్లో అత్యంతం భద్రత ఉంటుంది. కానీ అందులో ఢొల్లతనం తాజా ఘటన బయటపెట్టింది. కానీ చాలాకాలంగా సాగుతున్న పార్లమెంట్ పాసుల దందా ద్వారా హౌస్ లో అడుగుపెట్టిన ఏపీకి చెందిన రౌడీ షీటర్ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంతో దానిపై మరింత లోతుగా వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతోంది. అయితే సదరు వ్యక్తికి పాసు జారీ అయ్యింది కూడా ఏకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి పేరుతోననే విషయం బయటకు పొక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీకి చెందిన పోలీసులు దానికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నాయకుడి పేరుతో ఏపీకి చెందిన పలు నేరాలతో ప్రమేయం ఉన్న వ్యక్తికి పార్లమెంట్ పాసు అందిన తీరు విస్మయకరంగా మారింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పని జరుగుతోంది.

రాష్ట్రంలోని జగ్గయ్యపేటకు చెందిన రౌడీ షీటర్ నూకల సాంబశివరావుకు పార్లమెంట్లోకి అనుమతినిస్తూ పాస్ జారీ అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిపేరు మీద ఈ రౌడీ షీటర్ నూకల సాంబశివరావుకు పార్లమెంట్లో ప్రవేశానికి ఈ నెల 8వ తేదీన పాస్ జారీ అయినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కీ చెందిన రౌడీషీటర్ కు పార్లమెంట్లోకి ప్రవేశానికి పాస్ జారీ అయినట్లు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇతనిపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోను, మరికొన్ని స్టేషన్లలో నమోదైన క్రైమ్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర పరిధిలో అతని పై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యి ఉన్నాయి. అతని పై కేసులు, అందులోని సెక్షన్లు చదువుతూ పొతే సమయం సరిపోదు. ఇంత క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తికి పార్లమెంట్ పాస్ జారీ అవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు అత్యంత విశ్వాసనీయంగా తెలిసింది.

సహజంగా అసెంబ్లీ, పార్లమెంట్ లో అడుగు పెట్టాలంటే సదరు సభల్లో సభ్యులను సిఫార్సు లేఖలు అవసరం. కానీ పార్లమెంట్ సభ్యుల సిఫార్సు లేఖలు అంగడి సరుకుల్లా మరిపోయాయనే అభిప్రాయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అలా సభలో అడుగుపెట్టిన వారందరి వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతోంది. ఏపీలో అలాంటి వారి జాబితా వెల్లడయితే ఎవరెవరు అందులో ఉన్నారన్నది తెలుస్తుంది. వారి వివరాలు వెలుగులోకి వస్తే మరింత విస్మయకరంగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్