ఎన్నికల్లో ఓడినా సరే వైసీపీ నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో.. ఇప్పుడు కూడా అదే మాదిరిగా చెలరేగిపోతున్నారు. ఓ వైపు అక్రమ కేసులంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్న వైసీపీ నేతలు.. తాము చేసిన పనులను మాత్రం కప్పిపుచ్చుకుంటున్నారు. వై నాట్ 175 అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ఎంతో నమ్మకంగా చెప్పారు కూడా. అలాగే 30 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ముందు ఈవీఎం వల్ల కూటమి గెలిచింది అని ఆరోపణలు చేశారు. చివరికి దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అయినా సరే.. చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు రుజువు చేయలేకపోయారు. అయితే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ నేతల తీరు మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేతలతో పాటు సామాన్యులను సైతం నోటికి వచ్చినట్లు బూతులతో రెచ్చిపోయారు.
Also Read : మరో మైలురాయిని అధిగమించిన శ్రీ సిటీ..!
ఊరికి బోర్ కావాలని అడిగిన పాపానికి జనసేన పార్టీ కార్యకర్తను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు బూతులతో రెచ్చిపోయారు. అలాగే మా వీధికి రోడ్డు ఎందుకు వేయలేదు అని అడిగితే.. నువ్వు మా పార్టీ కాదు పో అన్నారు మంత్రి అంబటి రాంబాబు. వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాం.. ఆదుకోండి అని అడిగినందుకు ఎర్రి పప్పా అన్నారు నాటి మంత్రి కారుమూరి నాగేశ్వర్రావు. అభివృద్ధి ఫలాలు ఎప్పుడు అందుతాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. కోడి గుడ్డు పెట్టింది.. టైమ్ పడుతుంది కదా అన్నారు నాటి మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక మరో మాజీ మంత్రి కొడాలి నాని గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన శాఖ గురించి తప్ప.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నోటికి ఎంత మాట పడితే అంత మాటతో స్థాయి మరిచి మరీ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును, లోకేష్‌ను తిట్టాలంటూ పార్టీ ప్లీనరీ సమావేశంలో రోజా చెవులో ఉమ్మారెడ్డి చెప్పడం అందరికీ వినిపించింది. ఇక సజ్జల చెబితేనే తిట్టానంటూ పోసాని కృష్ణమురళి కూడా పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ కూడా సజ్జల వంటి నేతలు చెబితేనే రెచ్చిపోయినట్లు పోలీసుల ముందు వాపోయాడు.
Also Read : మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్.. చంద్రబాబు సంచలన కామెంట్స్
ఇవే వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు కూడా. పార్టీకి ఎదురు మాట్లాడిన వాళ్లపై దాడి చేయడం, మహిళలపై అత్యాచారాలు, నడి బజార్లోనే హత్యలు.. ఇలా ఒకటేమిటి.. చాలా ఉన్నాయి. ఇవన్నీ గమనించిన ప్రజలు వైసీపీ ప్రతిపక్షానికి కూడా సరిపోదని గుర్తించారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఇంత జరిగినా సరే.. వైసీపీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ అదే తరహాలో మాట్లాడుతున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి రోజా ఎమ్మెల్యేలను గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని వ్యాఖ్యానించారు. ఇక అనకాపల్లిలో జరిగిన సమావేశంలో మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెత్త మీద పన్ను వేస్తే.. చెత్త నా కొడుకు అన్నారు.. మరి కల్తీ మద్యం అమ్ముతున్నాడు కాబట్టి… కల్తీ నా కొడుకు అందామా.. అని రెచ్చిపోయారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని అయితే.. టీడీపీ నేతలపై దాడులు చేయండి అంటూ బహిరంగ సభలోనే వైసీపీ నేతలతో వ్యాఖ్యానించారు. ఇక మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే స్థాయి మరిచిపోయి నీచంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గురించి అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేశారు. ఇవి పెద్ద దుమారమే రేపాయి. ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి కూడా.
Also Read : ఆ ఇద్దరినే నమ్ముతున్న చంద్రబాబు.. ఐపిఎస్ లే బాబు టార్గెట్..?
అయితే వైసీపీ నేతల ఈ తరహా వ్యాఖ్యల వెనుక ఒకే ఒక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే జగన్ అంటున్నారు మిగిలిన పార్టీ నేతలు. రెండు నెలలు నేతలు సైలెంట్‌గా ఉంటే చాలు.. ఏమన్నా పార్టీ మారుతున్నావా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. నువ్వు కూడా సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నావంట కదా అని ప్రశ్నిస్తున్నారట జగన్. ఇప్పుడు కాకపోయినా ఎన్నికల ముందు అయినా మారిపోతావని తెలుస్తోంది లే.. అని జగన్ అనడంతో.. ఆ పార్టీ నేతలు భయపడుతున్నారట. ప్రతిపక్షాలను తిట్టకపోతే.. వాళ్లు పార్టీ మారుతున్న నేతల కింద లెక్క అనేది జగన్ భావన. ఇలా తిట్టే నేతలను ఇతర పార్టీలు చేర్చుకునే సమస్య లేదు కాబట్టి.. చావైనా, బతుకైనా ఇక్కడే ఉంటారనేది వైసీపీ అధినేత గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలను ఎవరు తిడితే.. వారికి పదవులిస్తామంటున్నారు వైసీపీ అధినేత అనుయాయులు.