వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మృతి వ్యవహారంతో.. మరోసారి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం వార్తల్లో నిలిచింది. సాక్షులు వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో పోలీసు వర్గాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఆరేళ్ళు అయినా సరే ఇప్పటి వరకు కేసులో పురోగతి లేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో సాక్షులను అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రంగన్న మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పై స్థాయిలో జరగడంతో ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతోంది.
Also Read : ప్రజాక్షేత్రంలోకి జగన్.. జవాబు చెప్పాలన్న టీడీపీ..!
ఈ తరుణంలో తాజాగా దీనిపై ఆయన కుమార్తె.. వైఎస్ సునీతా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలయిందని.. న్యాయం కోసం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నానన్నారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యదేచ్చగా తిరుగుతున్నారని ఆమె మండిపడ్డారు. విచారణ జరగట్లేదు.. ట్రైల్స్ నడవట్లేదు న్యాయం జరుగుతుందా అని నిలదీశారు. హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగట్లేదన్నారు.
Also Read : భారత్ అమెరికా సంబంధాలపై సంచలన సర్వే
ఈ కేసులో నిందితుల కంటే మాకు మా కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్టు అనిపిస్తుందని ఆమె విమర్శలు చేసారు. సిబిఐ వారు మళ్ళీ విచారణ ప్రారంభించాలని భావిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు. సాక్షులను మరియు నిందితులను కాపాడే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. సాక్షులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారని… సాక్షుల మరణాల పట్ల మాకు అనుమానం ఉందన్నారు. న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటా అని స్పష్టం చేసారు వైఎస్ సునీతా రెడ్డి.