ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాస్త వింతగా ఉంటాయనే మాట వాస్తవం. ఏపీ సిఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వింతలు, విశేషాలు మరింత ఎక్కువయ్యాయి అనే మాట వాస్తవం. అసలు ఏంటీ ఆ వింతలు అనేది మనం ఒకసారి చూస్తే… జగన్ అధికారంలో ఉన్న సమయంలో, జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మరియు ఇప్పుడు ఎమ్మెల్యేగా జగన్ ఉన్న సమయంలో గమనిస్తే మనకి ఈ వింతలు ఏంటో మనకి అర్ధం అవుతాయి. గతంలో ఏ నాయకుడు చేయని సాహసాన్ని జగన్ చేయడం అందరిని విస్మయానికి గురి చేస్తుంది.
అసలు ఏంటి ఆ వింత అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా నిరసనలను ఒక పద్దతిలో చేయకపోతే పోలీసులు అడ్డుకోవడం వంటివి జరుగుతాయి. అలాగే శాంతి భద్రతల విషయంలో కూడా రాజకీయ పార్టీల నాయకులు అతిగా ప్రవర్తిస్తే అలాంటి వాతావరణమే పోలీసుల నుంచి ఎదురు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జగన్ మాత్రం పోలీసులను బెదిరించే ధోరణితో వెళ్తున్నారు. అధికారంలో ఉండగా విపక్ష టిడిపి నాయకులకు రూల్స్ నేర్పించిన జగన్, ఇప్పుడు విపక్ష నేతగా జగన్ కి పోలీసులు అవే రూల్స్ చెబుతుంటే పోలీసులను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో జగన్ ను అడ్డుకున్న అధికారిని జగన్ బెదిరించిన తీరు కూడా అలాగే ఉంది.
అలాగే మీడియా సమావేశాలకు సాహసం చేయని జగన్.. పొరపాటున మీడియాతో మాట్లాడినప్పుడు ఆ సమయంలో ఏవైనా ప్రశ్నలు ఎదురైతే మీడియా ప్రతినిధుల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసుల మీద అయితే గతంలో మాదిరిగానే ఆయన దూకుడు స్వభావంతో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అడ్డు వచ్చిన పోలీసులను ఆయన గతంలో సిఎం గా ఉండి వేధించారు అనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో… నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాను అని జగన్ చెప్తున్నట్టుగా అర్ధమవుతుందని పలువురు మండిపడుతున్నారు. తాను చేసే కార్యక్రమాలు ఏ రూపంలో ఉన్నా పోలీసులు మౌనంగా ఉండాల్సిందే అనే సంకేతాలను జగన్ ఇస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.