Friday, September 12, 2025 05:01 PM
Friday, September 12, 2025 05:01 PM
roots

కొత్త నిబంధనలతో యూట్యూబర్లకు షాక్.. మానిటైజేషన్ మరింత కఠినం

నేటి యుగంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఆదాయ మూలాలుగా మారాయి. ముఖ్యంగా యూట్యూబ్‌ ద్వారా చాలా మంది పేరు సంపాదించాలనే ఆశతో లేదా డబ్బు కోసం తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. కొందరు ఫుల్‌టైమ్‌గా యూట్యూబ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే, మరికొందరు పార్ట్‌టైమ్‌గా చేస్తున్నారు. కానీ డబ్బు రావాలంటే కేవలం వీడియోలు అప్‌లోడ్ చేయడం చాలదు — యూట్యూబ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

Also Read : మరో మైలురాయిని అధిగమించిన శ్రీ సిటీ..!

అయితే యూట్యూబ్ ఇప్పుడు తన గైడ్‌లైన్స్‌ను మరింత కఠినంగా మార్చింది. యూట్యూబ్ గైడ్ లైన్స్ ను పాటిస్తూ వీడియోలు చేయడం చాలా అవసరం. ఇష్టానుసారం వీడియోలు చేస్తే యూట్యూబ్ అసలు ఒప్పుకోదు. తమ రూల్స్, అండ్ రెగ్యూలేషన్స్ ను పాటించాల్సిందే ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం, ఛానల్‌ మానిటైజేషన్ పొందాలంటే ఒరిజినల్ కంటెంట్ తప్పనిసరిగా ఉండాలి. రీ-యూజ్డ్ కంటెంట్‌, కాపీ పేస్ట్ వీడియోలు లేదా AI సృష్టించిన వీడియోలు ఉంటే ఇక నుండి మానిటైజేషన్‌ను యూట్యూబ్ తిరస్కరించనుంది.

Also Read : మళ్లీ మళ్లీ అదే బెదిరింపులు..!

అందుకే మీరు ఛానెల్ పెట్టాలి అనుకున్నా, లేదా ఛానెల్ పెట్టినా సరే జాగ్రత్త వహించండి. ఏఐ వీడియోలు, కంటెంట్ ను అసలు ఉపయోగించవద్దు. ఇక వేరే కంటెంట్ ను కాపీ చేసి కూడా మీరు యూజ్ చేయకండి. ఇక మీ ఒరిజినల్ కంటెంట్ ను మాత్రమే మీరు వాడండి. ఈ మార్పులు ఎందుకు చేశారంటే — అసలైన కంటెంట్‌ను ప్రోత్సహించడం, నకిలీ మరియు తక్కువ నాణ్యత గల వీడియోలను నివారించడమే ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు కొంతవరకు వీటిని ఊహించుకుని తీసుకున్నా, ఇకపై యూట్యూబ్ “లైట్‌గా” తీసుకోదు. గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా వీడియోలు వస్తే, ఇప్పటికే ఉన్న మానిటైజేషన్‌ కూడా రద్దు చేసే అవకాశం ఉంది.

యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్న వారికి సూచనలు:

మీ కంటెంట్ పూర్తిగా ఒరిజినల్‌ అయినట్టే చూసుకోండి

AI టూల్స్ వాడినా, పూర్తిగా డిపెండ్ అవడం తగదు

ఇతరుల కంటెంట్‌ను కాపీ చేయకండి

యూట్యూబ్ గైడ్‌లైన్స్‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకోండి

Also Read : మంత్రులలో మార్పు వచ్చింది గురూ.. చంద్రబాబు సర్కార్ లో కొత్త సీన్స్

చిన్న పొరపాటుతోనే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉన్నందున, ప్రతి యూట్యూబర్‌ గైడ్‌లైన్స్‌, క్వాలిటీ, ఒరిజినాలిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే మీరు నిరభ్యంతరంగా, స్థిరంగా ఆదాయం పొందే ఛానల్‌ను నడిపించగలుగుతారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్