ఇంతింతై… వటుడింతై అన్నట్లుగా మారింది జనసేన పార్టీ పరిస్థితి. 2012లో పురుడు పోసుకున్న జనసేన పార్టీ… 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ… టీడీపీ, బేజీపీ నేతల గెలుపు కోసం పవన్ పని చేశారు. దీంతో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మూడు పార్టీలు విడిపోయాయి. ఆ తర్వాత ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ-జనసేన-బీజేపీలు మళ్లీ జతకట్టాయి. ఇలా కలిసి పోటీ చేయడం వెనుక పవన్ రాజకీయ చతురత ఉందనే మాట బహిరంగ రహస్యం.
Also Read : గనుల వెంకటరెడ్డికి జైల్లో స్పెషల్ టీవీ, రిఫ్రిజిరేటర్?
ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఒకెత్తు అయితే… జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో వైసీపీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదనే మాట బలంగా వినిపిస్తోంది. వైసీపీ ఐదేళ్లు పాటు ఏపీలో అక్రమ పాలన సాగించిందని… జగన్ నియంతలా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి జగన్ మాత్రమే కారణమని ఆరోపిస్తున్నారు. అయితే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోని జగన్… మరోసారి పార్టీ కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. అలాగే నియంత పోకడలనే కొనసాగిస్తూ… అధికారంలోకి వస్తాం… తాట తీస్తాం అని నాలుగున్నరేళ్ల ముందే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో జగన్‌తో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అని పలువురు నేతలు భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే తట్టా బుట్టా సర్దుకుని వైసీపీకి రాజీనామా చెప్పేస్తున్నారు.
Also Read : తెలంగాణలో గేర్ మార్చిన కమలం పార్టీ…!
అయితే ఇలా వైసీపీ నుంచి బయటకు వచ్చే నేతలకు ప్రస్తుతం జనసేన మాత్రమే రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ విప్ ఉదయభాను, కిలారు రోశయ్య వంటి నేతలు ఇప్పటికే జనసేన కండువా కప్పుకున్నారు. మరి కొందరు నేతలు కూడా జై పవన్ అనేస్తున్నారు. వీరి జాబితాలోనే మరో కేంద్ర మాజీ మంత్రి కూడా చేరనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కిల్లి కృపారాణి…. త్వరలో జనసేన చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇప్పటికే తన అనుచరులకు కృపారాణి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.