తెలంగాణాలో బిజెపి అధికారం కోసం ఇప్పటికే వ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఫార్ములానే అక్కడ కూడా అమలు చేయాలని భావిస్తున్న బిజెపి అధిష్టానం ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలక అడుగులు వేస్తోంది. తెలుగుదేశం, జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోన్న ఆ పార్టీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా జిల్లా, నియోజకవర్గాల అధ్యక్షుల ఎంపిక కూడా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏకాభిప్రాయంతో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
Also Read : మళ్లీ తెరపైకి బిర్యానీ వార్..!
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ బలోపేతం క్షేత్ర స్థాయిలో కొంత వరకు జరిగింది. హిందూ సమాజాన్ని పార్టీ వైపు నడిపించడంలో కాస్త సక్సెస్ అయ్యారు. అయితే ఉత్తరాది భావజాలం ఉండే హైదరాబాద్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రమే కాస్త అది సాధ్యం అయినట్టు కనపడింది. గత ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనపడింది. ఏకంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది బిజెపి. ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వెనుకబడింది. రాబోయే ఎన్నికల్లో అధికారం టార్గెట్ గా ఇప్పుడు ప్రణాళిక సిద్దం చేసింది.
Also Read : కర్ణాటకకు పాకిన ఫోన్ ట్యాపింగ్.. భయంతోనే వాళ్ళ ఫోన్లు కూడా..?
అందుకే రాష్ట్ర అధ్యక్ష ఎంపికను వీలైనంత వేగంగా పూర్తి చేసి, స్థానిక సంస్థలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది ఆ పార్టీ. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎల్లుండి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. దాదాపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో సోయం బాపురావు పేరు కూడా వినపడుతోంది. గిరిజన ఓటు బ్యాంకు ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆయననే ఎంపిక చేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.