Tuesday, October 28, 2025 04:24 AM
Tuesday, October 28, 2025 04:24 AM
roots

కొడుక్కి ఇంత జరుగుతున్నా తండ్రి ఎక్కడ…?

తెలంగాణతోపాటు తెలుగు రాష్ట్రాల్లో మాజీమంత్రి కేటీఆర్ వ్యవహారం తీవ్ర రేపుతోంది. కేటీఆర్ ను ఏ క్షణమైనా సరే అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఈ విషయంలో ఎంటర్ కావడంతో కేటీఆర్ కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండటంతో ఏసీబీ అధికారులు అన్ని విధాలుగా సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ సాక్షాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు శుక్రవారం అందించారు ఏసీబీ అధికారులు.

అయితే ఇంత జరుగుతున్న సరే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ తండ్రి కెసిఆర్ మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఒక పక్క ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవని కేసిఆర్ ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేస్తున్న సరే బయటకు రాకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కనీసం ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం లేదు. సాధారణంగా ఇంత జరుగుతుంటే ముఖ్యంత్రులుగా పని చేసిన వారు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అసలు గతంలో ఏం జరిగిందో వివరించే ప్రయత్నం ఎంతో కొంత చేసేవారు.

Also Read : రేషన్ బియ్యంలో కీలకంగా కంప్యూటర్.. పేర్ని ఫ్యామిలీ అక్కడే దొరికిపోయిందా..?

కేటీఆర్ ను ఎప్పుడు అరెస్టు చేద్దామా అని ఏసీబీ అధికారులు రెడీగా ఉన్నా సరే కేసీఆర్ మాత్రం బయటికి రావటం లేదు. హైకోర్టు కేటీఆర్ కి 10 రోజుల టైం ఇచ్చింది. ఈ పది రోజుల తర్వాత తప్పకుండా అరెస్టు చేయాలని ఏసీబీ అన్ని విధాలుగా రెడీ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కేసు నమోదు చేసి సిద్ధంగా ఉంది. ఇక ఇది 55 కోట్ల స్కాం మాత్రమే కాదని 600 కోట్ల స్కామ్ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి ఆరోపణలు చేశారు. ఇన్ని వైపుల నుంచి కేటీఆర్ కు సవాళ్లు వస్తుంటే ఆయనకు అండగా నిలవాల్సిన కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు.

అప్పుడు కవిత విషయంలో కూడా కేసీఆర్ ఇలాగే మౌనం వహించారు బిజెపి పెద్దలు టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు కూడా అప్పట్లో చేయలేదు. ఇలా కేసీఆర్ బయటకు రాకపోవడంతో ప్రజల్లో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు మాజీ ముఖ్యమంత్రి అనే సంగతి పక్కన పెట్టి ఆయన కేటీఆర్ కు తండ్రి కదా కనీసం బయటకు వచ్చి మాట్లాడకపోవడం ఏంటి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్