వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయా…? ఇలాంటి మరిన్ని వ్యవహారాలు ఇప్పుడు ఆ పార్టీలో నుంచి వెలుగులోకి వచ్చే సూచనలు కనపడుతున్నాయా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. విజయసాయి రెడ్డిని వాస్తవానికి ఈ విషయంలో బయటకు లాగింది వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులే అన్న ప్రచారం బలంగా వినిపిస్తుంది. విజయసాయి కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రకటించి తన అనుమానాన్ని చెప్పకనే చెప్పారు.
తనకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో, వారి చీకటి వ్యవహారాలను సైతం విజయసాయి బయట పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఉన్న ఇద్దరు యువ నేతలు కూడా ఈ విషయంలో ఉన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ కీలక నాయకుల చీకటి వ్యవహారాలతో పాటు వారి రాసలీలలకి సంబంధించిన కీలక సమాచారం మీడియాకు అందించబోతున్నట్లు తెలుస్తుంది. వైసీపీలో నాయకుల మధ్య పోరు అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్ధకం చేసే సూచనలు కనపడుతున్నాయనేది ఆ పార్టీ కార్యకర్తల ఆవేదన. కొందరు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అధిష్టానం మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
నాయకుల మధ్య ఉన్న అంతర్గత పోరుతో పార్టీని నమ్ముకున్న వారిని, వారి రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయవద్దని కోరుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు ఆధిపత్యం చెలాయించడాన్ని కార్యకర్తలు ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా వాళ్ళే జగన్ వద్ద ఉన్నారని మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఇప్పటికి కూడా జగన్ ను కలవలేకపోతున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనేది మాత్రం ఆసక్తిని రేపుతున్న అంశం. విజయసాయి రెడ్డి… ఎవరి వ్యవహారాలను బయటకు లాగుతారు అనేది ఇప్పుడు సంచలనంగా మారిన అంశం. ఏది ఏమైనా ఈ వ్యవహారాలతో ప్రజా సమస్యలు పక్కదారి పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.