గత అయిదేళ్ళలో వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి విడదల రజనీ చేసిన పాపాలపై అధికారులు దృష్టి పెట్టారు. రైతుల భూములను ఆమె ఆక్రమించుకుంది అనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఇక కొందరు రైతులకు ఆమె నష్టపరిహారం అందించే విషయంలో కూడా అన్యాయం చేసారనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై సోషల్ మీడియాలో అప్పట్లో పలువురు సాక్ష్యాలతో సహా ఆరోపణలు చేసారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆమె చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Also Read: ఏపీ డీజీపీ ఎవరు..? ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్..?
చిలకలూరిపేట నియోజకవర్గంలో విస్తారంగా ఉన్న క్వారీలను అడ్డం పెట్టుకుని ఆమె అప్పట్లో భారీగా సంపాదించారు అనే ఆరోపణలు వచ్చాయి. చిలకలూరిపేటలో క్వారీ యజమాని బెదిరించి మాజీ మంత్రి రజిని రెండు కోట్లు తీసుకుందని అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పి నివేదిక ఇచ్చారు. ఐపీఎస్ అధికారి జాషువా.. రజిని పిఎల్ లు చెరో 10 లక్షలు చొప్పున తీసుకున్నారని, ఆ ఇద్దరే ఈ డీల్ సెట్ చేసారని గుర్తించారు. ఆ క్వారీ యజమానిని పదే పదే మంత్రి పేరు చెప్పి వేధించినట్టు వెల్లడి అయింది.
Also Read: పోలీసుల ముందు బోరుగడ్డ సంచలన విషయాలు
రెండు కోట్లు ఇస్తారా లేక 50 కోట్లు జరిమానా కడతారని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పి జాషువా బెదిరించారని నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది విజిలెన్స్ కమిటీ. 2020 శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ తనిఖీకి వెళ్ళిన అధికారులు వెళ్ళారు. ఆ సమయంలో వారు విధుల్లో లేరట. అదే రోజు ఉదయం ఎమ్మెల్యే పి రామకృష్ణ మిమ్మల్ని పిలుస్తున్నారంటూ క్రషర్ కి వెళ్లినట్లు నివేదికలో అధికారులు ప్రస్తావించారు. అలాగే సజ్జల రామకృష్ణా రెడ్డి మిమ్మల్ని పిలిచినట్టు కూడా బెదిరించారని చెప్పారట. దీనితో మాజీ మంత్రి విడుదల రజనీతో సహా మరో నలుగురుపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.