Friday, September 12, 2025 03:00 PM
Friday, September 12, 2025 03:00 PM
roots

విలక్షణ నటుడి కొలువుతీరింది – కోట శ్రీనివాసరావు ఇకలేరు

తెలుగు సినీ లోకానికి ఎనలేని సేవలందించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. విలన్ పాత్రలతో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసాయి.

తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాసరావు – బాబు మోహన్ కలయిక ఒక అపూర్వమైన హాస్యయుగాన్ని ప్రారంభించింది. తెరపై వీరిద్దరూ కనిపిస్తే చాలు, నవ్వుల వర్షం కురిసేది. వీరి కాంబినేషన్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశేవారు. హాస్యానికి కొత్త దిశ చూపిన ఈ జంట అనేక హిట్ చిత్రాలను అందించింది. కోట – బాబు మోహన్ కలసి దాదాపు 60కి పైగా సినిమాల్లో కలిసి నటించారు. కోట గారి గంభీరమైన డైలాగ్ డెలివరీ, శక్తివంతమైన నటన ఒక వైపు ఉంటే, బాబు మోహన్ అమాయకత్వంతో కూడిన టైమింగ్ కామెడీ మరోవైపు ఉండేది. వీరి హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వించేవి. అందుకే దర్శకులు, నిర్మాతలు వీరిద్దరినీ తమ చిత్రాల్లో తప్పనిసరిగా తీసుకునే వారు.

Also Read : ఈరోజు (13-07-2025) రాశి ఫలితాలు

మామగారు, ప్రేమ విజేత, సీతారత్నం గారి అబ్బాయి వంటి సినిమాల్లో వీరి జంట చేసిన కామెడీ ఈరోజు కూడా ప్రేక్షకుల గుర్తుల్లో ఉంది. ముఖ్యంగా “అహ నా పెళ్లంట” చిత్రంలో బాబు మోహన్ కనిపించకపోయినా, కోట శ్రీనివాసరావు చేసిన లక్ష్మీపతి పాత్ర మాత్రం తెలుగు హాస్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కోట మృతివార్త తెలిసిన వెంటనే బాబు మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నిన్న రాత్రే ఆయనతో మాట్లాడాను… ఈ వార్త నాకు ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది” అని కన్నీటితో గుర్తుచేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మృతి వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు షూటింగ్‌లు రద్దు చేసుకుని, ఆయనకు నివాళులు అర్పించేందుకు హైదరాబాదుకి చేరుకుంటున్నారు. ఆయన లేని లోటు తెలుగు సినిమా తీరనిది.

Also Read : స్విచ్ లు మాన్యువల్ గా ఆపలేం.. అనలిస్ట్ సంచలన కామెంట్స్

కోట శ్రీనివాసరావు మరణంపై టాలీవుడ్ సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “ఆయనను చూస్తూ.. ఆయనను మెచ్చుకుంటూ.. ప్రతి నటన నుంచి నేర్చుకుంటూ పెరిగాను. కోటా బాబాయ్ నాకు కుటుంబంలాంటివాడు. ఆయనతో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలను నేను గుర్తుంచుకుంటాను. కోట శ్రీనివాసరావు గారు, శాంతిగా విశ్రాంతి తీసుకోండి” అంటూ రవితేజ ట్వీట్ చేశారు. “ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతులు కోట శ్రీనివాసరావు గారు. మీ సినీచిత్ర జీవితంలో మీరు పోషించిన ప్రతీ పాత్ర ఒక అనుభూతి కలిగిస్తుంది. నవ్వించే వారు, ఏడిపించే వారు, చంపేద్దాం అనే కోపం తెప్పించేవారు. మిమ్మల్ని నేను ఎప్పడు మర్చిపోలేను. ” అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పలు నంది అవార్డులను అందుకున్నారు. ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్