Friday, September 12, 2025 05:18 PM
Friday, September 12, 2025 05:18 PM
roots

తన్నుకున్నారు.. కలిశారు.. బకరా చేశారు..!

అవును వాళ్లిద్దరు కలిసిపోయారు.. నిన్నటి వరకు బద్ధ శత్రువులు.. నువ్వెంత అంటే నువ్వెంత అని కయ్యానికి కాలు దువ్వారు.. నువ్వు పెంచితే నేను పెంచలేనా అని రెచ్చిపోయారు. ప్రపంచాన్ని భయపెట్టారు. వీళ్ల దెబ్బకు స్టాక్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. చివరికి అన్ని దేశాల ఆర్థిక నిపుణులు కూడా సయోధ్యకు యత్నించారు. కానీ రాజీ పడేది లేదని తెగేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరే కలిసిపోయారు.. ప్రపంచం మొత్తాన్ని బకారా చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసా.. ఒకరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరొకరు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

Also Read : మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధం తప్పదా..?

అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయారు. విదేశీ వస్తువులపై సుంకాలు భారీగా పెంచారు. ముఖ్యంగా చైనా దిగుమతి చేసే వస్తువులపై అయితే డబుల్ చేసేశారు. అసలు ఇతర దేశాలతో వాణిజ్యం వద్దు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభావం భారత్‌పై కూడా పడింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులతో పాటు భారత్‌ దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా ట్యాక్స్ విధించాడు ట్రంప్. దీంతో మేకిన్ ఇండియా బెటర్ అనే మాట బలంగా వినిపించింది. ఈ వాణిజ్య యుద్ధం కారణంగా భారత మార్కెట్లు కూడా కుదేలయ్యాయి.

అయితే డ్రాగన్ కంట్రీ చైనా పైన కయ్యానికి కాలు దువ్విన ట్రంప్.. సైలెంట్‌గా సెటిల్ చేసుకున్నారు. దౌత్య సంబంధాల్లో అమెరికా – చైనా ఒకటయ్యాయి. చైనాతో ట్రంప్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాడు. చైనాలో మాత్రమే లభించే రేర్ ఎర్త్ మాగ్నెట్ మూలకాలు అమెరికన్ కంపెనీలు కొనుగోలు చేయనున్నాయి. దీనికి బదులుగా అమెరికన్ యూనివర్సిటీల్లో చైనా విద్యార్థులకు ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : విమాన ప్రమాదానికి కారణం అదేనా..?

అమెరికా – చైనా ఒప్పందం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని వాణిజ్య వర్గాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా భారత ఆటో పరిశ్రమపైనే దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆటో పరిశ్రమలో ఈవీ రంగాలు భారీ నష్టాలకు గురవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గతంలోనే చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్‌తో చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ భేటీ అయ్యారు. రేర్ ఎర్త్ మాగ్నెట్ ఎగుమతులపై చర్చించారు. అయితే దీనిపై చైనా నుంచి సానుకూల ప్రకటన ఇంకా రాలేదు. వాస్తవానికి గతంలోనే రేర్ ఎర్త్ మాగ్నెట్ కోసం చైనాతో భారత బృందం రెండు సార్లు చర్చలు జరిపింది. కానీ భారత్‌కు ఎగుమతిపై చైనా ఎలాంటి సుముఖత చూపలేదు. కానీ ఇప్పుడు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల భారత్‌కు నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు వాణిజ్య నిపుణులు. ఈవీ తయారీలో కీలకమైన రేర్ ఎర్త్ మాగ్నెట్ మూలకాలు అందుబాటులో లేకపోతే.. వాటి తయారీపై ప్రభావం చూపిస్తుందని.. దాని వల్ల ఈవీ రంగం భారీగా నష్టపోతుందనేది ఇప్పుడు వాణిజ్య వర్గాల్లో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్