అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన అధికారులు భారత్ పై పదే పదే తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. రష్యాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో పదే పదే భారత్ ను అమెరికా టార్గెట్ చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు ఒకరు భారత్ పై విమర్శలకు దిగారు. భారత్ ను సుంకాల మహారాజుగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో. రష్యా నుంచి చమురు దిగుమతిని కొనసాగించడం ద్వారా భారత్ లాభదాయక కార్యక్రమాన్ని నడుపుతోందని మండిపడ్డారు.
Also Read : అమెరికా వీసాకు కొత్త రూల్స్.. వీసా రావాలంటే కష్టమేనా..?
భారత దిగుమతులపై 50 శాతం శిక్షాత్మక సుంకాలు వచ్చే వారం ప్రణాళిక ప్రకారం అమలులోకి వస్తాయని తాను ఆశిస్తున్నానని అన్నారు. ఆగస్టు 27 ఇవి అమలు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ముందు, వాస్తవానికి భారత్, రష్యన్ చమురును కొనుగోలు చేయలేదన్నారు. భారత్ కు ఉన్న చమురు అవసరాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే కొన్నారని.. కాని ఇప్పుడు అది 35 శాతానికి పెరిగిందని విమర్శించారు. వారికి చమురు అవసరం లేదన్నారు.
Also Read : తప్పుడు పనులు చేస్తే వదలను.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
శుద్ధి కర్మాగారాలకు లాభం చేకూర్చే కార్యక్రమం అని మండిపడ్డారు. రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తామని భారత్ పై అమెరికా దాడికి దిగింది. 50 శాతం సుంకం విధించడంతో విసిగిపోయిన భారత ప్రభుత్వం రష్యాతో తన దీర్ఘకాల స్నేహాన్ని పునరుద్ఘాటించింది. అటు చైనాతో కూడా సన్నిహిత సంబంధాల కోసం భారత్ ప్రయత్నం చేస్తోంది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి ప్రారంభమైనప్పటి నుండి భారత్, రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచిన మాట వాస్తవమే.
దాని వెనుక బలమైన కారణం ఉంది. ఆ సమయంలో గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాలు ఉక్రెయిన్ ఇంధన ఆదాయాన్ని పరిమితం చేసే లక్ష్యంతో మాస్కో ముడి చమురుపై బ్యారెల్‌కు 60 డాలర్ల ధర పరిమితిని విధించాయి. ఆ కొనుగోళ్లు రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడంలో సహాయపడుతున్నాయని ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోంది.