Friday, September 12, 2025 07:08 PM
Friday, September 12, 2025 07:08 PM
roots

అమ్మో ట్రంప్… అడ్మిషన్లు వదులుకుంటున్నారా..?

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం ఏమో గాని భారతీయ విద్యార్ధులకు కంటి మీద కునుకు కరువైంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అని భయం భయంగా బ్రతుకుతున్నారు. ఇప్పటికే ఇండియా సహా పలు దేశాలకు వెళ్ళిన భారతీయ విద్యార్ధులను వెంటనే తమ దేశానికి తిరిగి రావాలని అమెరికా యూనివర్సిటీలు మెయిల్స్ కూడా చేస్తున్నాయి. అటు వర్క్ వీసాపై ఉన్న వారు కూడా తిరిగి వెంటనే అమెరికా చేరుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్దులకే ఎక్కువ కంగారు ఉందని తెలుస్తోంది.

Also Read : తనకు క్రికెట్ కంటే చదువే ముఖ్యం అంటున్న స్టార్ క్రికెటర్

అమెరికాలో ఉన్నత చదువుల కోసం కనీస పరిజ్ఞానం లేకుండా కొందరు ప్రాక్సీ ద్వారా ఇంగ్లీష్ పరిక్షలు క్రాక్ చేసారు. వారికి అక్కడి కాలేజీలు అడ్మిషన్ లు కూడా ఇచ్చాయి. అమెరికా విమానాశ్రయాల్లో దిగడానికి అన్నీ సిద్దంగా ఉన్నా… అక్కడ దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఏ సమాధానాలు చెప్తారు అనేదే ప్రధాన ప్రశ్న. ఫైనాన్షియల్ విషయాల్లో కూడా కొందరికి కనీస అవగాహన ఉండటం లేదు. పార్ట్ టైం జాబ్ చేసుకుని కాలేజీ ఫీజులు కడతామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సరైన లోన్ పేపర్స్ కూడా లేకుండా ఫ్లైట్స్ ఎక్కుతున్నారు.

Also Read : తన సస్పెన్షన్ వార్తల పై జానీ మాస్టర్ క్లారిటీ

ఈ బ్యాచ్ కు కచ్చితంగా అక్కడ ఇబ్బందులే ఎదురు అవుతాయి. అలాగే హెచ్ 1 బీతో అమెరికా వెళ్ళే బ్యాచ్ కూడా కనీస అవగాహన లేకుండా వెళ్తున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత మారిన రూల్స్ తో పాటు… ఇమ్మిగ్రేషన్ అధికారుల ప్రశ్నల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. సరిగా 8 ఏళ్ళ క్రితం ఇదే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది సరైన పత్రాలు లేకపోతే అమెరికా కాలేజీలు ఇచ్చిన ఆఫర్ లెటర్స్ ను కూడా వదులుకుంటున్నారట. ముఖ్యంగా నార్త్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అక్కడ ఇంగ్లీష్ ప్రావిణ్యం నూటికి నూటయాబై అన్నట్టు ఉంటుంది. అందుకే ఇప్పుడు అలెర్ట్ అవుతున్నారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్