Friday, August 29, 2025 09:31 PM
Friday, August 29, 2025 09:31 PM
roots

సహారా టూ డ్రీం 11.. టీం ఇండియా స్పాన్సర్లను వెంటాడుతున్న కష్టాలు

భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ అంటే చాలు స్టార్ ఇమేజ్ వచ్చేస్తుంది. అందుకే స్టార్టప్ కంపెనీలు సహా ఎన్నో ప్రముఖ సంస్థలు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి టీం ఇండియాకు స్పాన్సర్లుగా వ్యవహరించేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు టీం ఇండియా స్పాన్సర్ లకు సినిమా వేరే లెవెల్ లో కనపడుతోంది. బ్రాండ్ పాపులారిటీ పక్కన పెడితే.. దివాళా తీసే వరకూ పరిస్థితి వెళ్ళడం ఆశ్చర్యపరుస్తోంది. 2011 నుంచి పలు సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు పడ్డాయి.

Also Read : వన్డేలు ఆడతారు.. కోహ్లీ, రోహిత్ పై బోర్డు క్లారిటీ..!

ఇప్పుడు డ్రీం 11 వంతు వచ్చింది. 2001లో సహారా సంస్థ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత టీం ఇండియా స్పాన్సర్ గా అడుగు పెట్టింది. సుదీర్ఘ కాలం పాటు ఆ సంస్థ స్పాన్సర్ గా ఉంది. దాదాపు 12 ఏళ్ళ పాటు స్పాన్సర్ గా వ్యవహరించింది. కానీ 2011 నాటికి సెబీ దెబ్బకు మూతపడింది. దాని వ్యవస్థాపకుడు సుబ్రతో రాయ్ కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక ప్రసార దిగ్గజం స్టార్ ఇండియా, 2014 నుండి 2017 వరకు బాగా రాణించింది, కానీ యాంటీట్రస్ట్ దర్యాప్తులు, ఆర్థిక ఒత్తిళ్లలో చిక్కుకుని వెనుకబడింది.

Also Read : క్రికెటర్లను అవమానిస్తోన్న బోర్డు.. ఎందుకీ వైఖరి..?

చైనా ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా ప్రపంచ వ్యాప్తంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పుడు మార్కెట్ లో పోటీ తట్టుకోలేక వెనుకబడింది. మధ్యలో మైక్రో మ్యాక్స్ కూడా ఒకటి రెండు సీరీస్ లకు స్పాన్సర్ గా ఉంది. ఆ తర్వాత ఆ సంస్థ కూడా వెనుకబడి మూతపడింది. బైజూస్ అయితే దివాళా తీయడమే కాదు.. ఇప్పుడు తీవ్ర నష్టాల్లో ఉంది. సంస్థను పైకి తెచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం దెబ్బకు.. డ్రీం 11 కూడా మూతపడింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్