ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ప్రజలకి తెలిసిందే. తన వ్యతిరేక శక్తులని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నా జగన్ ఏమాత్రం తగ్గడం లేదు. అదేవిధంగా వైసీపీలోనే ఉండి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి. రోజూ తిడుతున్న రఘురామకృష్ణంరాజుకి కూడా ఆ ఇబ్బందులు తప్పలేదు. ఆయన్ను అరెస్ట్ చేయడం.. ఆ తరువాత కోర్టుల జోక్యంగా బెయిల్ పై విడుదల చేయడం జరిగిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు వైసీపీ నుండి రఘురామ కృష్ణంరాజు బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అప్పట్లో. అయితే నర్సాపురంలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకకపోవడంతో బయటకు వెళ్లిపోయిన రఘురామ కృష్ణంరాజుని బ్రతిమిలాడి మళ్లీ టికెట్ ఇచ్చి తీసుకువచ్చారు. సర్వేలు, ప్రజలు కూడా ఆయన వైపే ఉండడంతో ఎంపీగా గెలిచారు ఆయన. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నా, ఎక్కడ చెందిందో ఏమో కానీ, రఘురామ కృష్ణంరాజు మళ్ళీ జగన్ ను విమర్శించడం మొదలు పెట్టారు. అయితే ఆయనకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్న జగన్ కు రఘురామ కృష్ణంరాజు పెద్ద షాకే ఇచ్చారట.
రఘురామకృష్ణంరాజు వైసిపి ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు జగన్ కి సమాచారం అందిందట. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జగన్, ఆయన మీద పార్టీ పరంగా చర్యలు తీసుకోకుండా, రాజ్యాంగ పరంగా చర్యల కోసం స్పీకర్ ని బ్రతిమిలాడుకోవటం మొదలుపెట్టారట. జగన్ కి వ్యతిరేకంగా విపక్షాలను కలపడంలో కూడా రఘురామ కృష్ణంరాజు సక్సెస్ అయ్యారని తెలుస్తుంది.
తన లెక్క ప్రకారం బిజెపి, జనసేనతో కలిసి తెలుగుదేశం కలిసి సాగేలా ఉంటే తాను నర్సాపురంలో పోటీ చేస్తే, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తే ఇద్దరికీ విజయం సిద్ధిస్తుంది అనేది ఆయన స్కెచ్ అనేది పరిశీలకుల మాట. అయితే ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు దూకుడుకు చెక్ పెట్టేందుకు జగన్ నరసాపురంలో అంతా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్ని పరిస్థితుల్లో ఆయన పార్లమెంటులో అడుగుపెట్టకూడదు అని వైఎస్ జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారని వైసీపీ నాయకులే చెబుతున్నారు.
ఇంతకీ జగన్ వేసే ఆ ప్లాన్ ఏంటంటే నరసాపురంలో కృష్ణంరాజు ఇదివరకు మూడుసార్లు గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన సతీమణి శ్యామలాదేవి గారిని వైసీపీ తరఫున పోటీ చేయమని అడుగుదామని జగన్ ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది. అలా చేస్తే గనుక ఇటు కృష్ణంరాజు చనిపోయిన సానుభూతి ఎలాగూ ఉంటుంది కాబట్టి జగన్ స్కెచ్ విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్ కూడా ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో కృష్ణంరాజు కుటుంబాన్ని ఒప్పించే ఏర్పాట్లు చేయమని తన అంతరంగీకులని ఆదేశించినట్లు తెలుస్తుంది. మరి ఇదే నిజమైతే రఘురామకృష్ణంరాజు ఎలాంటి వ్యూహంతో ముందుకొస్తారో చూడాలి.