Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

తెలుగు రాష్ట్రాలకు షేక్ చేస్తున్న భాయ్ అరెస్ట్… చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు సినీ ప్రముఖులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా దుమ్ము రేపుతున్న అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70mm థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఒక మహిళ మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి నేడు మధ్యాహ్నం అరెస్టు చేశారు. దీనితో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్ రద్దు చేసుకున్నారు.

Also Read : అమ్మో పవన్ అంటున్న అధికారులు.. తర్వాతి గురి ఎవరిపై..?

అలాగే స్టార్ నిర్మాత దిల్ రాజు మరి కొంతమంది సినిమా ప్రముఖులు వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. ఇక అక్కడికి భారీగా అభిమానులు చేరుకోవడంతో పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటన జరగకుండా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. అటు రామ్ చరణ్ కూడా తన సినిమా షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్ వచ్చేస్తున్నారు. అలాగే మెగా హీరోలు అందరూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు.

Also Read : కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం… గవర్నర్ గ్రీన్ సిగ్నల్…?

ఇక వెంటనే హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ ను అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి దాఖలు చేసే అత్యవసరంగా తమ పిటిషన్ విచారించాలని కోరారు. అటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అరెస్టుపై తీవ్ర స్థాయిలో ఫైర్ ఫైర్ అయ్యారు. “అలా అంటే హైడ్రా కారణంగా ఇద్దరు మృతి చెందారు కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఏది ఎలా ఉన్నా ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్