Friday, September 12, 2025 11:19 PM
Friday, September 12, 2025 11:19 PM
roots

తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?

రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని పట్టుదలగా ఉన్న స్టార్ హీరో విజయ్… ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమయ్యాడు. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న తరుణంలో తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆయన భేటీ కావడం సంచలనంగా మారింది. ఏడాది క్రితం పార్టీ ప్రకటించిన విజయ్.. ఇప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. పేదలకు అలాగే వెనుకబడిన వర్గాలకు ఎక్కువగా సీట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్న విజయ్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.

Also Read : బిజెపి ఆదేశాలు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్

తమిళనాడు ఎన్నికల్లో సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దీనితో విజయ్ కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం డిఎంకె పార్టీ చాలా బలంగా ఉంది. ఇక విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి. ఈ టైంలో పాదయాత్ర ద్వారా తన పార్టీని బలోపేతం చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ తో భేటీ అనంతరం దీనిపై తమిళ మీడియాతో పాటుగా జాతీయ మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి.

Also Read : రోజాకు బై బై చెప్పిన జగన్..!

విజయ్ గనుక ప్రజల్లోకి వెళితే కచ్చితంగా… అది డిఎంకె కంటే బిజెపి, అన్నా డీఎంకే కూటమికి ఎక్కువగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. దీనితో మళ్లీ డిఎంకే అధికారాల్లోకి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కమల్ హాసన్, రజినీకాంత్ వంటి వాళ్ళు రాజకీయాల్లో దాదాపుగా చేతులు కాల్చుకున్న పరిస్థితి. రజినీకాంత్ చివరి నిమిషంలో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇక కమలహాసన్ కనీసం తాను కూడా ఎన్నికల్లో విజయం సాధించలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు విజయ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తాడు అనేది చెప్పలేం. ఇక విల్లుపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంచి స్పందన వచ్చింది. దీనితో విజయ్ ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్