Saturday, September 13, 2025 05:14 AM
Saturday, September 13, 2025 05:14 AM
roots

టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరు…??

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఓ వైపు తిరుమల లడ్డు వ్యవహారం, మరోవైపు మద్యం పాలసీ ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి పెద్దగా ప్రజలకు కనపడటం లేదు గాని… రాజకీయ పార్టీలు ఈ విషయంలో గట్టిగానే కష్టపడుతున్నాయి. ఇప్పుడు అధికార టీడీపీ నుంచి కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్ధుల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సరైన అభ్యర్ధిని రంగంలోకి దింపేందుకు తీవ్రంగానే కృషి చేస్తున్నారు..

ఇక కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మండలిలో అడుగు పెట్టాలని దేవినేని ఉమా గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇటీవల బుడమేరు వాగు గండి పనుల కోసం ఆయన తీవ్రంగా కష్టపడ్డారు. గతంలో జలవనరుల శాఖా మంత్రిగా పని చేసిన అనుభవంతో ప్రస్తుత మంత్రికి పూర్తిగా సహకరించారు ఉమా. ఈ కష్టం అంతా ఎమ్మెల్సీ పదవి కోసమే అనే కామెంట్స్ వచ్చాయి. కాని చంద్రబాబు మాత్రం ఆలపాటి రాజా వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రాజాకు ఉమాతో పోలిస్తే సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. డెల్టా ప్రజల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది. ఆ ప్రాంతంలో డెల్టా టైగర్ అని కూడా పిలుచుకుంటారు. ఉమాకు కృష్ణా జిల్లా నేతలతో విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఉమాను ఇప్పుడు చంద్రబాబు మండలికి పంపడానికి ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read Also : మామా ఏక్ పెగ లా… ఏపీలో లిక్కర్ పాలసీ వచ్చేసింది

ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే… మాజీ మంత్రి జవహర్ పేరు వినపడుతోంది. అయితే జవహర్ ను కొందరు వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. అందుకే మరో నేత పేరు పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేరుని చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ జాబితాలో సీటు వదులుకున్న మరో నేత కూడా ఉన్నారని టాక్. మరి ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. ఏది ఏమైనా ఈ ఎన్నికలు టిడిపి, వైసీపీ లకు ప్రతిష్టాత్మకం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తే అధికారం చేపట్టిన 100 రోజులకే వ్యతిరేకత వచ్చిందని వైసీపీ ప్రచారం మొదలుపెడుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్