Tuesday, October 28, 2025 02:22 AM
Tuesday, October 28, 2025 02:22 AM
roots

ఏపీలో రేపు ఏం జరగబోతోంది..?

రేపు ఏం జరగబోతోంది… అది కూడా సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు… ఏదో పెద్దదే జరిగేలా ఉంది.. ఇవే ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న ప్రశ్నలు. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ, వైసీపీలు. సరిగ్గా 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు BIG Expose… STAY TUNED అంటూ తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో ఏం జరగబోతోంది అనే రచ్చ మొదలైంది. ఈ పోస్టు మధ్యాహ్నం 11.35 గంటలకు పోస్ట్ చేశారు. అయితే సరిగ్గా రెండు గంటల వ్యవధిలో మధ్యాహ్నం 1.38 గంటలకు వైసీపీ అధికార ఎక్స్ అకౌంట్‌ కూడా గెట్ రెడీ ఫర్ ట్రూత్ బాంబ్ డ్రాపింగ్ ఆన్ 24th అక్టోబర్ 12PM అంటూ పోస్ట్ చేశారు. BIG REVEAL అంటూ పోస్ట్ చేయడం మరోసారి దుమారం రేపుతోంది.

ఏపీలో హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి మూడు నెలలుగా వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతల రాజీనామా, బంధువులే పార్టీకి గుడ్ బై చెప్పడం… జగన్‌కు అత్యంత ఆప్తులే సైలెంట్‌ అవ్వడంతో… వీటితో పాటు నిన్నటి వరకు నోటికి వచ్చినట్లు మాట్లాడిన నేతలంతా రకరకాల అవినీతి కేసుల్లో, గతంలో చేసిన దాడుల్లో పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక అధినేత జగన్ కూడా ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్లాడు. హోదా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తాడేపల్లికి రావడం తగ్గించారు. బెంగళూరు ప్యాలెస్‌లోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు.

Also Read : డిజిటల్ ఇండియాలో ఆంధ్రా కొత్తపుంతలు

టీడీపీ పెట్టిన పోస్టుపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. జగన్ అరెస్టు ఖాయమని కొందరు.. బెయిల్ రద్దు అని మరి కొందరు పోస్టు చేస్తున్నారు. ఇంకొందరైతే బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ అరెస్టు ఖాయమేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ప్రస్తుతం జగన్ అత్యంత నమ్మకస్తుల జాబితాలో ఉన్న పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందంటున్నారు. వైసీపీలో నిన్నటి వరకు చక్రం తిప్పిన నేత సజ్జల, వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేస్తున్నారా అనేది మరికొందరి ప్రశ్న. ఇక వైసీపీ పెట్టిన పోస్టుపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ మూసేస్తున్నారా అని కొందరు… కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తున్నారా అని… ఈవీఎం నిజాలు బయటపెడుతున్నారా అని మరికొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్