ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు నియోజకవర్గాలను పక్కన పెట్టారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. చాలా మంది మంత్రులు విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. కొంతమంది కనీసం సచివాలయానికి కూడా వెళ్లకుండా విజయవాడలోనే ఎక్కువగా గడపడం… క్యాంప్ ఆఫీసుల్లోనే ఎక్కువగా ఉండటంపై అసహనం వ్యక్తం అవుతుంది. నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నాయుడు సూచిస్తున్నా సరే.. కొంతమంది మాత్రం విజయవాడ వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు.
Also Read: మాటలేనా.. నిజంగా చేతల్లో చూపించే దమ్ముందా?
ఒకవేళ విజయవాడ నుంచి బయటకి వెళ్ళాల్సి వస్తే హైదరాబాదు, లేదంటే బెంగళూరు మాత్రమే వెళుతున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాలను మంత్రులు పట్టించుకోకపోవడాన్ని ఆ నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు కూడా సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఎప్పుడైనా వచ్చినా సరే కంటితుడుపుగా వచ్చి వెళ్ళిపోతున్నారనే ఆగ్రహం కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. కీలక నియోజకవర్గాల మంత్రులు కూడా కార్యకర్తలకు… నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం పట్ల పార్టీ అధిష్టానం కూడా ఇప్పుడు ఆగ్రహంగానే ఉంది.
Also Read: ఏపీలో ప్రభుత్వం మారిందా.. లేక..!
ఇతర పార్టీల మంత్రులు ఎక్కువగా ప్రజల్లో తిరుగుతుంటే… తెలుగుదేశం పార్టీ మంత్రులు మాత్రం విజయవాడకు పరిమితం అయిపోతున్నారు. లేదంటే గుంటూరులో ఉంటున్నారు. అప్పుడప్పుడు సచివాలయానికి వెళ్లి అక్కడ సమయం ఎక్కువగా గడుపుతున్నారు. పర్యటనలు చేసే విషయంలో ఆసక్తి చూపించడం లేదు. దీనిపై దృష్టి పెట్టకపోతే మాత్రం ప్రజలకు అలాగే క్యాడర్ కు గ్యాప్ వచ్చే అవకాశం ఉందనే… ఆగ్రహం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన తప్పులే మళ్ళీ జరుగుతున్నాయని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.