Friday, September 12, 2025 04:53 PM
Friday, September 12, 2025 04:53 PM
roots

ఆ నియోజకవర్గాలకు కొత్త బాసులు..!

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 13 నెలలైంది. కూటమి పొత్తు మరో 15 ఏళ్లు కొనసాగుతుందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కూటమిలోని మూడు పార్టీల్లోని నేతల మధ్య విభేదాలున్నాయని.. వీటిని వెంటనే సరిచేసుకోవాలనేది అధినేతల సూచన. కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని.. వాటిని సరిచేసుకుని సర్దుకు పోవాలని మార్కాపురంలో నిర్వహించిన సభలో పవన్ కూడా వ్యాఖ్యానించారు. అయితే కూటమిలో తమకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మెజారిటీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ ఏపీ అధ్యక్ష ఎన్నిక సభలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు కూడా. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు.

Also Read : వైసీపీపై కెటిఆర్ ప్రేమ ఒలకబోత.. షాకింగ్ అంటూ కామెంట్స్

2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు 3 పార్టీలు జతకట్టాయి. పొత్తులో భాగంగా బీజేపీ 10 స్థానాల్లో పోటి చేయగా.. 8 చోట్ల విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా గెలిచింది. టీడీపీ 135 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు కేటాయించిన సీట్లల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల్లో తొలి నుంచి రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదరలేదు. చివరికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా జనసేన, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అభివృద్ధి మావల్లే.. అంటే.. కాదు మా వల్లే అని రెండు పార్టీల నేతలు పదే పదే ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి బ్రేక్ పెట్టాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడటం లేదు. కొన్ని చోట్ల నేతలు, కార్యకర్తల మధ్య ఏమాత్రం సయోధ్య కుదరటం లేదు.

Also Read : మంత్రులలో మార్పు వచ్చింది గురూ.. చంద్రబాబు సర్కార్ లో కొత్త సీన్స్

వాస్తవానికి ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన పార్టీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. అలాంటి చోట్ల టీడీపీ నేతలే ఆ పార్టీల్లోకి వెళ్లారు. అవనిగడ్డలో బుద్ద ప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి జనసేన, బీజేపీలో చేరి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో ఇంఛార్జులను నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా వర్మను నియమించారు. అనపర్తి ఇంఛార్జు బాధ్యతలను అనూహ్యంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్‌ను నియమించారు. కాకినాడ రూరల్ ఇంఛార్జుగా పిల్లి అనంతలక్ష్మి, రాజోలు ఇంఛార్జుగా గుబ్బల శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ ఇంఛార్జుగా బుద్దా వెంకన్న, తిరుపతికి సుగుణమ్మ, అవనిగడ్డ బాధ్యతలను బొబ్బా గోవర్థన్‌కు అప్పగించారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే కొత్త ఇంఛార్జులను నియమించే దిశగా టీడీపీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలం పెంచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ క్రమంగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే పొత్తు కారణంగా సీట్లు వదులుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలంతా కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు. అయినా సరే అధినేత చంద్రబాబు మాత్రం వెనుకడుగు వేయలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలకు నచ్చజెప్పారు. టీడీపీ గెలుపు ఎంత అవసరమో వివరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేతలు ఒప్పుకున్నారు. ఇక సీట్లు వదులుకున్న నేతలకు నామినేటెడ్ పదవులిస్తామని హామీ ఇచ్చారు. వీరిలో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారికి ఇంకా పదవులివ్వలేదు. ఇప్పుడు ఇంఛార్జులను నియమించడం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్