Friday, September 12, 2025 02:59 PM
Friday, September 12, 2025 02:59 PM
roots

టార్గెట్ కమ్మ సామాజిక వర్గం.. సోషల్ మీడియాలో కొత్త వ్యూహం..?

2019 లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి.. వైసీపీ కమ్మ సామాజిక వర్గాన్ని బూచిగా చూపించడం. రాజధాని అమరావతి నుంచి, పోలీసు వ్యవస్థలో ప్రమోషన్ ల వరకు ఇదే జరిగింది. అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని కూడా కులానికి లింక్ చేసింది వైసీపీ. సీఎం హోదాలో జగన్ ఎన్నో సందర్భాల్లో ఆ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. విజయసాయి రెడ్డి వంటి వాళ్ళు కమ్మ సమాజాన్ని అవమానంగా మాట్లాడిన సందర్భాలు సైతం ఉన్నాయి.

Also Read : టీంలో ఆ ఒక్కడికే ఎందుకీ ఈ అన్యాయం..?

తాజాగా సోషల్ మీడియాలో కనపడుతున్న కొన్ని ఎకౌంటు లు ఆశ్చర్యం కలిగించాయి. కమ్మ సామాజిక వర్గ ఇంటి పేర్లతో ఎకౌంటు లు క్రియేట్ చేసి, చంద్రబాబును, లోకేష్, ఇతర టీడీపీ నేతలను విమర్శించడం మొదలుపెట్టారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా కనపడే ఇంటి పేర్లను వాడుకుని ఫేక్ ఎకౌంటు లు క్రియేట్ చేసారు సోషల్ మీడియాలో. అమరావతిని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, పెట్టుబడుల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో చంద్రబాబును విమర్శిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read : రెండు తప్పులు సీరీస్ ను ముంచాయా..?

దీనిని గమనించిన కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు.. ఆ ఎకౌంటు ల స్క్రీన్ షాట్ లు పెడుతూ, అలెర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఘట్టమనేని, వల్లభనేని, కొల్లి, కొడాలి, నాదెండ్ల, సూర్యదేవర, వాసిరెడ్డి.. ఇలా కొన్ని ఇంటి పేర్లతో ఎకౌంటు లను క్రియేట్ చేసారు. టీడీపీ కార్యకర్తలు పోట్టిన పోస్ట్ లలో కింద కామెంట్ లు పెట్టడం, చంద్రబాబు పర్యటనలను అవమానించడం వంటివి చేయడం గమనార్హం. వీటిని వైసీపీ కార్యకర్తలు స్క్రీన్ షాట్ లు తీసి.. టీడీపీకి, కమ్మ సామాజిక వర్గానికి దూరమైంది అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్