Tuesday, October 28, 2025 04:37 AM
Tuesday, October 28, 2025 04:37 AM
roots

ప్రపంచ కప్ కష్టమే.. గవాస్కర్ సంచలన కామెంట్స్

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో వారి అంతర్జాతీయ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాళ్ళు రాబోయే ప్రపంచ కప్ ఆడతారా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఇప్పటికే టి20, టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం, వన్డే క్రికెట్ కూడా పెద్దగా ఆడకపోవడంతో.. వీళ్ళు కొనసాగుతారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. అయితే ప్రపంచ కప్ పై దృష్టి పెట్టడానికే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది

Also Read : షాక్ ఇచ్చిన కోహ్లీ.. మొన్న రోహిత్ నేడు కోహ్లీ

విరాట్ కోహ్లీ.. చిన్న నాటి కోచ్ ఇటీవల మాట్లాడుతూ.. కోహ్లీ.. వచ్చే ప్రపంచ కప్ గెలిచే విషయంలో క్లారిటీగా ఉన్నాడని, అప్పటి వరకు ఆడతాడు అంటూ కామెంట్స్ చేసారు. ప్రపంచకప్ ఇంకా రెండేళ్ళు ఉన్న నేపధ్యంలో.. 2027 వన్డే ప్రపంచ కప్ భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడే అవకాశాలపై సునీల్ గవాస్కర్ సందేహం వ్యక్తం చేసాడు. మెగా టోర్నమెంట్ నాటికి రోహిత్ కు 40 ఏళ్ళు రాగా.. కోహ్లీకి 38 ఏళ్ళు వస్తాయి. రోహిత్, కోహ్లీ ఇద్దరూ దేశవాళి క్రికెట్ కు సైతం దూరంగా ఉన్నారు.

Also Read : ఇంటరెస్టింగ్ గా టెస్ట్ టీం సెలెక్షన్.. కొత్త ఆటగాళ్ళు ఎవరు..?

ఫిట్నెస్ పరంగా రోహిత్ కంటే కోహ్లీ మెరుగ్గా ఉన్నాడు. దీనితో కోహ్లీ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ.. లేదు, వాళ్ళు ఆడతారని నేను అనుకోవడం లేదని కామెంట్ చేసాడు. నేను నిజాయితీగా చెబుతున్నాను వాళ్ళు ఆడటం కష్టం అని కామెంట్ చేసాడు. కాగా కోహ్లీ విషయంలో బోర్డు పెద్దలు కాస్త దృష్టి పెట్టినట్టు సమాచారం. జట్టు బ్రాండ్ వాల్యూ, మైదానాల్లో ప్రేక్షకుల రాక, ఆన్లైన్ వ్యూవర్ షిప్ అన్నీ కోహ్లీ డామినేట్ చేస్తున్న నేపధ్యంలో బోర్డు పెద్దలు అతని విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్