సాధారణంగా బయట మార్కెట్ నుంచి ఏవైనా నాన్ వెజ్ తీసుకువస్తే వాటిని కడిగి శుభ్రం చేస్తూ ఉంటాం. చేపలు, మటన్, రొయ్యలు, చికెన్ తదితర ఆహార పదార్థాలను శుభ్రంగా కడిగిన తర్వాత వండుకుని తింటూ ఉంటారు. అయితే ఈ విషయంలో నిపుణులు ఎన్నోసార్లు తమ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. సాధారణంగా ప్రజల్లో ఉండే అభిప్రాయం ప్రకారం బయట నుండి తెచ్చుకున్న ఆహారాన్ని శుభ్రం చేసుకుని తినకపోతే అనారోగ్యాలు వస్తాయి అనే భావన ఉంటుంది. కరోనా తర్వాత ఈ శుభ్రం మరింత ఎక్కువైంది. అనేక రకాల వైరస్లు దాడి చేయడంతో ప్రజల్లో అవగాహన కూడా శుభ్రంపై పెరిగింది.
Also Read : ఒకరు క్లాస్.. మరొకరు మాస్.. ఫుల్ బ్యాలెన్స్..!
అయితే ఇది కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు సైతం వినపడుతూ ఉంటాయి. శుభ్రం చేసుకోవడం తప్పులేదు గాని అతిగా శుభ్రం చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ ఉంటారు నిపుణులు. తాజాగా చికెన్ విషయంలో పరిశోధకుల అభిప్రాయం ఒకటి వైరల్ గా మారింది. చికెన్ షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్ తీసుకురాగానే శుభ్రం చేయడం వల్ల అనేక రకాల ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందని పరిశోధకులు పరిశోధనల్లో గుర్తించారు.
Also Read : ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్..? బయటకు రాని టీటీడీపీ నాయకులు
చికెన్ పై.. క్యాంపిలోబ్యాక్టర్ అనే ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుందని.. చికెన్ ను ట్యాప్ కింద ఉంచి కడుగుతున్నప్పుడు నీళ్లు తుంపర్లుగా వ్యాపించి, కడిగే వారి శరీరంతో పాటుగా బట్టలు, పక్కన ఉన్న వారి శరీరంపై పడే అవకాశం ఉందని.. ఈ బ్యాక్టీరియా వాళ్లకు కూడా సౌకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర బ్యాక్టీరియాగా చెబుతున్న పరిశోధకులు.. దీని కారణంగా డయేరియా, జ్వరం, నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలా కడగకుండా చికెన్ ను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే సరిపోతుందని.. అందులో ఉండే చెడు బ్యాక్టీరియా వేడికి కనుమరుగవుతుందని సూచిస్తున్నారు. శుభ్రం సంగతి పక్కన పెడితే సరికొత్త సమస్యలు తెచ్చుకోకుండా ఉండడానికి చికెన్ కడగకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.