టీం ఇండియా స్టార్ క్రికెటర్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత వన్డే క్రికెట్ ఫ్యూచర్ విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి. చివరకు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు కెప్టెన్ గా ఎంపిక కావడం లాంచనం అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఫిట్నెస్ టెస్ట్ కు కూడా రోహిత్ శర్మ అటెండ్ అయ్యాడు. దీనితో వచ్చే వరల్డ్ కప్ నాటికి కూడా రోహిత్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.
Also Read : ఆ ముగ్గురు.. వారి వారసులు.. తేడా ఎందుకిలా..?
సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి రోహిత్ శర్మ వెళ్ళాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, రోహిత్ ఆసుపత్రిలోకి వెళ్తున్నట్టు కనపడింది. అక్కడ కొందరు మీడియా ప్రతినిధులు అతనిని మాట్లాడించే ప్రయత్నం చేసినా వేగంగా ఆస్పత్రికి వెళ్ళిపోయాడు. దీనితో రోహిత్ ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. అతని తల్లి కోసం ఆస్పత్రికి వెళ్లి ఉండవచ్చని జాతీయ మీడియా అభిప్రాయపడింది. అయితే అక్కడ రోహిత్ ఒక్కడే కనిపించాడు. దీనిపై ఆస్పత్రి వర్గాలు కూడా స్పందించలేదు.
Also Read : గంభీర్ కి చెక్ పెడుతున్న బోర్డ్..? షాకింగ్ నిర్ణయం..!
అటు సోషల్ మీడియాలో మాత్రం రోహిత్ కు గాయం అయి ఉండవచ్చు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కాగా రోహిత్ వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఆ పర్యటనలో అతని ఆట తీరుపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికే రోహిత్ కు 38 ఏళ్ళు రాగా.. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 వస్తాయి. దీనితో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. అటు హెడ్ కోచ్ గంభీర్ మాత్రం రోహిత్ రిటైర్ కావాలని ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.