Tuesday, October 28, 2025 07:04 AM
Tuesday, October 28, 2025 07:04 AM
roots

పంత్ మరో అదిరిపోయే రికార్డ్..!

విదేశాల్లో టెస్ట్ సీరీస్ అనగానే కొందరు ఆటగాళ్లకు పండుగే. అందులో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, పుజారా, బూమ్రా ముందు వరుసలో ఉంటారు. పిచ్ ఎంత కఠినంగా ఉన్నా సరే నిలకడగా రాణిస్తూ ఉంటారు ఈ ఆటగాళ్ళు. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ లో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరూ ప్రభావం చూపించారు. కెఎల్ రాహుల్ ఓపెనర్ గా వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా అదే స్థాయిలో రాణించాడు. డిఫెన్స్ తో పాటుగా తన మార్క్ షాట్స్ తో అల్లాదించాడు.

Also Read : యోగాంధ్ర టార్గెట్ అదే.. బాబు రీచ్ అవుతారా..?

కీలక ఇన్నింగ్స్ ఆడి అర్ధ సెంచరీ సాధించాడు పంత్. ఇదే సమయంలో ఓ రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ పొట్టి ఆటగాడు. శుక్రవారం హెడింగ్లీలో ప్రారంభమైన తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ కీలక మైలురాయి సాధించాడు. SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా) దేశాలలో అత్యంత విజయవంతమైన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా నిలిచాడు. 26 ఏళ్ల రిషబ్ పంత్ 2025–27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ ను ఘనంగా ప్రారంభించాడు.

Also Read : సురేఖా వాణి ఏమి టాటూ వేయిచుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తొలి రోజున అజేయంగా 65 పరుగుల చేసిన పంత్ ధోనీ ని అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్ లో పంత్ టెస్ట్ క్రికెట్ లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. 76వ ఇన్నింగ్స్ లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ తర్వాత అత్యంత వేగవంతమైన వికెట్ కీపర్ గా రెండో స్థానంలో నిలిచాడు. 63 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు గిల్ క్రిస్ట్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్