Friday, August 29, 2025 09:35 PM
Friday, August 29, 2025 09:35 PM
roots

‘కెప్టెన్ మిల్లర్’ మూవీ రివ్యూ

“అణిచివేత నుంచే పోరాటం పుడుతుంది.. ఆధిపత్యం నుంచే తిరుగుబాటు మొదలవుతుంది.. ఊచకోత నుంచే ఉద్యమం ఊపిరి తీసుకుంటుంది.”.. మన దేశ స్వతంత్ర సంగ్రామం నుంచీ ప్రపంచదేశాల్లో స్వేచ్ఛ కోసం సాగిన ప్రతి పోరాటంలోనూ జరిగింది ఇదే. ఇక ‘కెప్టెన్ మిల్లర్‌’ సినిమాలో కూడా చూపించింది ఇదే. మన దేశాన్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలిస్తున్న సమయంలో జరిగిన స్టోరీనే ‘కెప్టెన్ మిల్లర్’. అంటరానితనం, కులం అనే భూతాల్ని అగ్గితో కాల్చి అణగారిన వర్గాలను ధైర్యంగా గుడిలో కాలు మోపేలా చేసిన ఒక పోరాట వీరుడి కథే ‘కెప్టెన్ మిల్లర్’. మరి ఈ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్ ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.

తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఆ గ్రామాన్ని తమ దేవుడు ‘ఘోర హరుడు’ కాపాడుతుంటాడని అక్కడి తెగ ప్రజలు తరతరాలుగా నమ్ముతుంటారు. ఇక ఆ ఊరిలో ఎంతో విలువైన పగడపు రాయితో ఘోర హరుడి బొమ్మ ఒకటి తయారు చేసి అక్కడి రాజుకి వారు బహుమతిగా ఇస్తారు. దీనికి మెచ్చిన రాజు ఆ ఊరి గుడి చుట్టూ ఉన్న స్థలాల్ని ఆ తెగకి రాసి ఇచ్చేస్తాడు. అయితే తరాలు గడిచిన తర్వాత ఆ రాజు వారసులు ఆ స్థలాలు తమవేనని అక్కడి ప్రజలని తన్ని తరిమేయాలని చూస్తాడు. కానీ వాళ్లు తిరుగుబాటు చేస్తారేమోననే భయంతో అంటరానితనం, తక్కువ జాతి అనే పేరుతో వారిని కాళ్ల కింద తొక్కిపెట్టి గుడిలోకి అడుగుపెట్టకుండా తన అధికారాన్ని చూపిస్తాడు. అయితే ఆ తెగ ప్రజలు అప్పట్లో రాజుకి ఇచ్చిన విలువైన బొమ్మ గురించి బ్రిటీష్ వారికి తెలిసిపోతుంది. దీంతో కోహినూర్‌ని మన దేశం నుంచి దొంగలించినట్లే ఈ విలువైన బొమ్మని కూడా కాజేయడానికి సిద్ధపడతారు తెల్లదొరలు.

ఇక బ్రిటీష్ సైన్యానికి భయపడి ఆ ఊరిని పాలించే రాజు కూడా చేతులెత్తేసి ఆ బొమ్మని అప్పజెప్పేస్తాడు. కానీ తెలివిగా ఆ బొమ్మని దొంగతనం చేయడానికి తమ ఊరికే చెందిన అగ్ని (ధనుష్)ని రంగంలోకి దింపుతాడు. మరి బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించి అగ్ని ఆ బొమ్మని దొంగలిస్తాడా? అసలు ఈ అగ్ని ఎవరు? బ్రిటీష్ సైన్యంలో చేరిన అతను తర్వాత ‘కెప్టెన్ మిల్లర్’గా మారి అదే తెల్ల దొరలపై తిరుగుబాటు ఎందుకు చేశాడు? అనేదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే?

‘కెప్టెన్ మిల్లర్’ స్టోరీ మనకి తెలియని కొత్త కథ ఏం కాదు. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ స్టోరీ లైన్‌తో ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంతమంది తీసినా అది మనకి బోర్ కొట్టదు. ఎందుకంటే దేశం, స్వతంత్ర పోరాటం అనగానే మన నరనరాల్లో ప్రవహించే రక్తం ఒక్కసారిగా ఉప్పెనలో పోటెత్తుతుంది. తెల్లదొరలను పాతరేసే ఏ సినిమాకి అయినా థియేటర్లకి జాతరలా పోతుంటాం. కెప్టెన్ మిల్లర్ విషయంలో కూడా అదే జరిగింది. డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ కొత్తది కాకపోయినా దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించాడు. ఒక సాదాసీదా కుర్రాడు ‘కెప్టెన్ మిల్లర్’గా మారి తెల్ల వాళ్లని గడగడలాడించే ప్రతీ సీను థియేటర్లో గట్టిగానే పేలింది. ఇక జీవీ ప్రకాశ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

ఇక మిల్లర్ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. “అంటరానితనం అంటూ ప్రజల్ని దూరంగా పెట్టే మన రాజుల కింద ఉండటం కంటే ఆ తెల్ల దొరల కాళ్ల కింద నలిగిపోవడమే మంచిది.. అదే ఒకింత గౌరవం” అంటూ మిల్లర్ పాత్ర చెప్పే కొన్ని డైలాగులు అప్పట్లో అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో కళ్లకి కట్టినట్లు చూపించింది. ఇక సినిమా మొదలైన మొదటి గంట సాదాసీదాగా సాగిపోతుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా వేగం అందుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో బ్రిటీష్ సైన్యం నుంచి హీరో ఆ బొమ్మను దొంగలించే సీన్ హైలెట్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌ మళ్లీ స్లో అయినా క్లైమాక్స్‌లో వచ్చే పోరాట సన్నివేశాలు, ఊహించని ఎంట్రీలతో సినిమా ఆడియన్స్‌కి ఓ సంతృప్తిని ఇస్తుంది. ఇక సినిమా చివరిలో కెప్టెన్ మిల్లర్ సీక్వెల్‌కి డైరెక్టర్ హింట్ ఇచ్చాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్