Friday, August 29, 2025 09:35 PM
Friday, August 29, 2025 09:35 PM
roots

‘గేమ్ ఆన్’ మూవీ రివ్యూ

కొత్త కథలు ఏమీ ఉండవు.. ఉన్న కథల్నే కొత్తగా చెప్పాల్సి వస్తుంది. అలా ఓ పాత పాయింట్‌ను ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా తీసిన ప్రయత్నమే గేమ్ ఆన్. ఈ టైటిల్ చూసినా, టీజర్ ట్రైలర్ చూసినా కూడా ఇదేదో గేమింగ్ సినిమా, ఈ తరం కిడ్స్ కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది. కానీ అసలు కంటెంట్ లోపల దాచి ఉంచామని ప్రమోషన్స్‌లో మేకర్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ గేమ్ ఆన్ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

కథ
ఆత్మ న్యూనతా భావంతో లూజర్ అని తనకు తాను ఫీలవుతుంటాడు సిద్దార్థ్ (గీతానంద్). తాను పని చేస్తున్న గేమ్ లూప్ అనే కంపెనీలో ఎప్పుడూ బాస్ చేత చీవాట్లు తింటూ ఉంటాడు. ఇలాంటి సిద్దార్థ్ జీవితంలో ఫ్రెండ్ అయిన రాహుల్ (కిరీటీ దామరాజు), లవర్ మోక్ష (వాసంతి) ఇద్దరూ కలిసి మోసం చేస్తారు. ఇక మోసంతో సిద్దార్థ్ మరింతగా కుంగిపోతాడు. చనిపోవాలని అనుకుంటాడు. అదే టైంలో ఓ గేమ్‌లోకి ఎంటర్ అవుతాడు సిద్దార్థ్. మొదటి టాస్క్‌గా ఈగను చంపితే లక్ష వస్తుంది. అలా ఒక్కో టాస్క్ చేసుకుంటూ వెళ్లే సిద్దార్థ్‌లో ఫుల్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. తాను విన్నర్ అనే భావన కలుగుతుంది. ఆ తరువాత తార (నేహా సోలంకి) సిద్దార్థ్ జీవితంలోకి వస్తుంది. ప్రేమలో హాయిగా ఉన్న సిద్దార్థ్‌కు చివరి టాస్క్ ప్రమాదంగా మారుతుంది? అసలు ఆ టాస్క్ ఏంటి? ఆ టాస్కులు ఎవరు ఇస్తున్నారు? ఈ కథలో డా. మదన్ మోహన్ (ఆదిత్య మీనన్) పాత్ర ఏంటి? సిద్దార్థ్ తల్లి అర్చన (మధుబాల) పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అన్నది కథ

గేమ్ ఆన్ కథ ప్రారంభం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఒక లూజర్ అనే భావనలో ఉండటం, అన్నీ అపజయాలే వస్తుండటం, ఆత్మన్యూనతా భావంతో ఉండటం, ఫ్రెండ్, లవర్ చేతిలో మోసం పోవడం వంటి సీన్లతో సినిమా మెల్లిగా అలా సాగుతుంది. ఎప్పుడైతే హీరో గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడో.. టాస్కులు చకచకా పూర్తి చేసేస్తుంటాడో పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అప్పటి వరకు చూసిన హీరోనే ఇలా చేస్తున్నాడా? ఏంటి ఈ స్పీడు అన్నట్టుగా హీరో చేశాడు. దర్శకుడు చేయించాడు. అలా మంచి స్పీడు మీదున్న కథకు మళ్లీ లవ్ ట్రాక్ జాయిన్ చేసి యూత్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు అసలు చిక్కుముడి పడుతుంది. అక్కడ చిన్న ట్విస్ట్‌లాంటిది ఉంటుంది.

సెకండాఫ్‌లో ప్రారంభంలో మళ్లీ కాస్త స్లోగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. అందులో హీరోని ఓ చిన్నపాటి సైకోలానే చూపించారు. ఆ పార్ట్ బాగానే వర్కౌట్ అయింది. మధ్య మధ్యలో పెట్టిన యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. వాటికి ఇచ్చిన ఆర్ఆర్, హీరో ఎలివేషన్స్ బాగున్నాయి. అయితే హీరోయిన్ పార్ట్ కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. రొటీన్‌లానే కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలు చాలానే వచ్చాయి కదా? అనిపిస్తుంది.

ఇక మధుబాల పాత్ర కూడా అంత ఎఫెక్టివ్‌గా కనిపించదు. పైగా ఆమె తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకుడికి కాస్త ఇబ్బంది కలిగిన ఫీలింగ్ రావొచ్చు. ఆదిత్య మీనన్‌ని తన పాత్రకు న్యాయం చేశాడు. శుభలేక సుధాకర్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటుంది. ఇలా అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా రాసుకున్న స్క్రిప్ట్.. అందులోని ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. కెమెరాలు ఇంట్లో ఎలా పెట్టాడు.. అయితే కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్‌ను ఇంకాస్త బాగా చూపించే అవకాశం ఉన్నట్టుగా అనిపించింది.

టెక్నికల్‌గా ఈ చిత్రం బాగుంది. ఆర్ఆర్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగుతుంది. ఫుల్ రేసీగా అనిపిస్తుంది. ఫస్ట్ సాంగ్, రొమాంటిక్ పాటలు తెరపై లావిష్‌గా కనిపిస్తాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్‌గా తగులుతాయి. ఎడిటింగ్ చక్కగా ఉంది. కెమెరా వర్క్ మెప్పిస్తుంది. తెర అంతా కూడా రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాత బాగానే ఖర్చు పెట్టాడని కనిపిస్తోంది. ఆ ఖర్చుకు తగ్గ అవుట్ పుట్, ఫలితం వచ్చేలానే ఉంది. గేమ్ ఆన్ ఆడియెన్స్‌ను మరీ గొప్పగా థ్రిల్ చేయకపోయినా.. నిరాశపర్చకపోవచ్చు. ఈ వారం వచ్చిన సినిమాల్లో ఒకసారి చూసి ఎంజాయ్ చేసే ఆప్షన్‌గా గేమ్‌ ఆన్‌ను పెట్టుకోవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్