Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

కాల్పుల విరమణ పై దేశ ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పేదెవరు?

సాధారణంగా ప్రపంచ దేశాలకు అమెరికా పెద్దన్న లాంటిది. చాలా దేశాల అంతర్గత వ్యవహారాల్లో సైతం అమెరికా తలదూర్చుతూ ఉంటుంది. మన దేశం సహా చాలా దేశాల రిజర్వ్ బ్యాంకు లపై కూడా అమెరికా పెత్తనం అనే మాట వింటూనే ఉంటాం. ఇప్పుడు భారత్ – పాకిస్తాన్ వ్యవహారాల్లో కూడా ఇలాగే జోక్యం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. రెండు దేశాల మధ్య యుద్ధం తధ్యం అనుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ సంచలనం అయింది.

Also Read : షాక్ ఇచ్చిన కోహ్లీ.. మొన్న రోహిత్ నేడు కోహ్లీ

వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్తాన్ విషయంలో ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెబుతుందని ఆ దేశానికి.. చుక్కలు చూపిస్తుందని చాలామంది ఎదురు చూశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ కు ప్రపంచవ్యాప్తంగా పలు కీలక దేశాల నుంచి మద్దతు లభించింది. ఇక దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ పై ప్రశంసలు కురిపించారు ప్రజలు. అటు ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అలాగే భారత సైన్యానికి అండగా నిలబడ్డాయి.

Also Read : సినిమాలు ఆగుతాయా..? ఆ సినిమాల రిలీజ్ ఎప్పుడు..?

దీనితో పాకిస్తాన్ తో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే.. ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పటం ఖాయం అని భావించారు. కానీ ఆ అమెరికా మధ్యవర్తిత్వం చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకారం తెలపడంతో చాలామంది షాక్ అయ్యారు. అసలు ఇక్కడ అమెరికా జోక్యం చేసుకుంటే భారత్ ఆగడం ఏంటి అనేది ప్రధాన ప్రశ్న. గతంలో బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా.. అమెరికా పాకిస్తాన్ కు మద్దతు తెలిపింది. కాల్పుల విరమణ కూడా చేయాలని ప్రతిపాదించింది.

Also Read : అవును.. వాళ్ల ఆచూకీ కనిపెట్టలేరు..!

కానీ.. భారత్ మాత్రం అందుకు అంగీకారం తెలపలేదు. కార్గిల్ యుద్ద సమయంలో కూడా ఇలాగే జరిగింది. అమెరికా అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ జోక్యం చేసుకునే అవకాశం లేకుండా భారత్ వ్యవహరించింది. ఇప్పుడు జరుగుతోంది యుద్ధం కాదు. కేవలం ఉగ్రవాదులపై పోరు. అలాంటిది అమెరికా ఆపమంటే భారత్ ఏ విధంగా ఆపుతుంది..? దేశ భద్రతకు ముప్పుగా మారిన పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో ట్రంప్ చెప్పాడని భారత్ ఎలా వెనక్కు తగ్గుతుంది..? ఉగ్రవాదంపై పోరు ఆగదని భారత్ చెప్పినా.. పాకిస్తాన్ భూ భాగంలో ఉన్న ఉగ్రవాదులపై ఏ విధమైన దాడులు చేయకుండా కాల్పుల విరమణతో అమెరికా.. భారత్ కాళ్ళకు బంధం వేసింది.

Also Read : ఏపీ భవిష్యత్తు నిర్మిస్తున్నాం.. లోకేష్ ఆసక్తికర కామెంట్స్

ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యే అయినప్పటికీ.. కాశ్మీర్ లో వారి కార్యాకలాపాలు మాత్రం భారత్ కు అంతర్గత సమస్య. పైగా పాకిస్తాన్ సైన్యం పదే పదే కాల్పులు జరుపుతూ సాధారణ పౌరులను, సైనికులను బలి తీసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత కూడా భారత్ పై కాల్పులు జరిపి పలువురిని బలి తీసుకుంది. అలాంటప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాల్సిన అవసరం భారత్ కు ఏంటీ..?

Also Read : మన సైన్యం బలమెంత.. యుద్ధం వస్తే పాక్ పరిస్థితి ఏంటీ..?

అసలు ఏ షరతుల ప్రకారం కాల్పుల విరమణకు అంగీకారం తెలిపారు..? భారత ప్రధాని మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన మాటను అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేయడం ఏంటీ..? మూడవ దేశం అవసరం లేదని చెప్పిన భారత్.. తన పౌరులను, సైనికులను పాకిస్తాన్ బహిరంగంగా హతమార్చిన తర్వాత మూడవ దేశం చెప్తే ఎందుకు కాల్పుల విరమణకు అంగీకారం తెలపాల్సి వచ్చింది..? ఒక్కసారి కూడా ప్రధాని మీడియా ముందుకు ఎందుకు రాలేకపోయారు..? కనీసం రక్షణ మంత్రి కూడా ఎందుకు మీడియాతో మాట్లాడలేదు..? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్