Friday, September 12, 2025 05:01 PM
Friday, September 12, 2025 05:01 PM
roots

ఎవరి కొడుకైనా టాలెంట్ ఉండాల్సిందే.. పవన్ సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంఎం జ్యోతి కృష్ణ, కృష్ణ జాగర్లమూడి దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు చిత్రానికి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా అన్ని హంగులు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదల కానుంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసారు. ముందు డైరెక్టర్ క్రిష్ మంచి హై కాన్సెప్ట్ కథతో వచ్చారని, ఆ కథ తనకు ఎంతగానో నచ్చింది అన్నారు పవన్. ఇక సినిమా కోసం ఏఎం రత్నం పడిన తపన అంతా ఇంతా కాదన్నారు.

Also Read : బన్నీ టార్గెట్ వేరే లెవెల్.. మరీ ఈ రేంజ్ లోనా..?

షూట్ మొదలైన దగ్గరి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారని, సినిమా ముందుకు వెళ్తుందా అనే అనుమానాలు ఉండేవని కాని, సినిమా పూర్తి చేశామన్నారు. ఒకప్పుడు రత్నం గారి కోసం డిస్ట్రిబ్యూటర్లు తిరిగే వారన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రత్నం ఆర్ధిక ఇబ్బందులు పడటం తనకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు. డబ్బు గురించి, సినిమా సక్సెస్ గురించి కాదు పరిశ్రమ కోసం నిలబడటం ముఖ్యమన్నారు. ఈ సినిమాలు అనాథలా వదిలేసాము అనిపించింది. అలా కాకూడదు అని భావించే నేను వచ్చాను. నా సినిమాలు నేను ఎలా వదిలేస్తాను. నేను కోట్లాది మంది తెలుగు ప్రజలకు అండగా ఉండే వాడిని.. అలాంటిది నా సినిమాలు నేను ఎలా వదిలేస్తాను అన్నారు. నిర్మాత రత్నం ఎన్ని సమస్యలు వచ్చినా మౌనంగా ఉంటారు. ఆ మౌనమే ఈరోజు నన్ను రోడ్డు మీదకు వచ్చేలా చేసింది. ఆయన ఒక మంచి సినిమా తీశారు అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను.

Also Read : రంగంలోకి దువ్వాడ.. వాళ్లే టార్గెట్..!

సినిమా పరిశ్రమలో ఎవరైనా సరే టాలెంట్ ఉంటేనే నిలబడతారన్నారు. అది చిరంజీవి కొడుకైనా, పవన్ కళ్యాణ్ కొడుకైనా, ఎవరైనా సరే టాలెంట్ ఉండాల్సిందే అని స్పష్టం చేసారు పవన్. మిగతా హీరోలతో పోలిస్తే తనకు అంత బిజినెస్ రాదన్న ఆయన, తన దృష్టి ఎప్పుడూ.. సినిమాలపై ఉంటుందని, వ్యాపారంలో కాదన్నారు. సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. రాజకీయపరంగా నాకు ఎంత పేరున్నా, ఇతర హీరోలతో పోల్చితే నాకు అంత బిజినెస్ ఉండకపోవచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనమంతా కులం, మతం, ప్రాంతం, భాష పేరుతొ కొట్టుకుంటాము. కానీ సినిమాకు ఈ వివక్షలేవీ ఉండవు.. మనకు సత్తా లేకుంటే సినిమా రంగంలో నిలబడలేము. అలాంటి సినిమారంగంలో కొత్తవాళ్లు రావాలి. వాళ్ళ కోసం ఏఎం రత్నం లాంటి వాళ్ళు ఉండాలి. ఆయనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను వచ్చాను అన్నారు పవన్, ఈ సినిమాకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా సరే ముందుకు తీసుకుని వెళ్ళడానికి కృషి చేసామని పవన్ వివరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్