చరిత్రలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఓ సంచలనంగా చెప్పుకోవాలి. తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. దీనిపై తాజాగా ఐఖ్యరాజ్య సమితిలో సంచలన వ్యాఖ్యలు చేసింది భారత్. ఐఖ్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ పాక్ సైన్యం దారుణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహిళల హక్కులపై మాట్లాడే పాకిస్తాన్.. వారి సైనికుల దారుణమైన రికార్డును ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించారు.
Also Read : కెప్టెన్ పదవి పై సమాచారం ఉంది.. గిల్ కామెంట్స్..!
బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సమయంలో, ఆపరేషన్ సెర్చ్‌లైట్ సందర్భంగా పాకిస్తాన్ సైన్యం లక్ష మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిందని పర్వతనేని హరీష్ ఆరోపించారు. కాశ్మీరీ మహిళల దుస్థితిని ఫోరమ్ లో హైలైట్ చేయడానికి పాక్ ప్రయత్నించగా.. హరీష్ మాట్లాడుతూ.. మానవత్వం అనేది పాకిస్తాన్ మర్చిపోయిందని, దారుణమైన నేరాలకు పాల్పడిందని ఆయన మండిపడ్డారు. సెర్చ్ లైట్ పేరుతో పాక్ సైన్యం బంగ్లాదేశ్ గ్రామాల్లోకి చొచ్చుకు వెళ్ళింది.
Also Read : రైలులో రచ్చ.. మరోసారి హక్కుల గోల..!
నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ దళాలు, రజాకర్ పారామిలిటరీ దళ సభ్యులు 2,00,000 నుండి 4,00,000 మంది బెంగాలీ మహిళలు మరియు బాలికలపై ఒక క్రమబద్ధమైన జాతి విధ్వంసక అత్యాచారానికి పాల్పడినట్టు వివరించారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి స్వతంత్ర దేశాన్ని కోరుకునే ప్రజలను భయపెట్టడానికి ఒక ప్రణాళిక ప్రకారం ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ లైంగిక హింస కారణంగా వేలాది మంది మహిళలు గర్భం దాల్చారని, జననాలు, గర్భస్రావాలు, శిశుహత్యలు, ఆత్మహత్యలు వంటివి జరిగాయని, 1971 డిసెంబర్‌లో పాకిస్తాన్ సైన్యం భారత సైన్యానికి లొంగిపోయిన తర్వాతే ఈ దారుణాలు ముగిశాయని ఆయన వ్యాఖ్యానించారు.