Friday, September 12, 2025 03:47 PM
Friday, September 12, 2025 03:47 PM
roots

వివేకా కేసు.. మరో పరిటాల రవి కేసు అవుతోందా…?

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు… 2019 సాధారణ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ హత్య.. ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. హత్య ఎవరు చేసారో, ఎవరు చేయించారో అన్ని సాక్షాలు ఉన్నా సరే సిబిఐ గాని కేంద్ర దర్యాప్తు బృందాలు గానీ ఈ విషయంలో ముందుకు వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ కేసు మరో పరిటాల రవి కేసు లాగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 2005లో పరిటాల రవిని హత్య చేసిన తర్వాత కీలక సాక్షులు, అలాగే హత్యకు సూత్రధారులు అందరూ దాదాపుగా మరణించారు.

Also Read : రేవంత్ బీజేపీలోకి వచ్చెయ్.. ఎంపీ సంచలన కామెంట్స్

ఆ కేసు ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం అదే. ఆ కేసులో ఉన్న మద్దెలచెరువు సూరి, మొద్దు శ్రీను సహా పలువురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే జరిగింది. జగన్ మామ గంగిరెడ్డి.. ఆ తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి, అలాగే జగన్ డ్రైవర్ ఒకరు, ఇక తాజాగా.. వాచ్మెన్ రంగన్న ఇలా పలువురు ప్రధాన సాక్షులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ఈ కేసు మాత్రం ముందుకు వెళ్ళకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకానొక సమయంలో సిబిఐ అధికారులు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే వరకు వెళ్లినా ఆ తర్వాత వెనక్కు తగ్గారు.

Also Read : తెలంగాణాపై మీనాక్షి గురి.. యాక్ట్ చేస్తే తాట తీస్తాం..!

మళ్ళీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. ఓ వైపు వైఎస్ కుటుంబ సభ్యులు ఈ హత్య కేసు విషయంలో పోరాటం చేయడం, మరోవైపు వరుసగా ప్రధాన సాక్షులు ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితులు అరెస్టు అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ముందుకువెళ్ళలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు సాక్షులు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్