Tuesday, October 21, 2025 07:23 PM
Tuesday, October 21, 2025 07:23 PM
roots

ఓజీ.. రెడీ ఫర్ స్క్రీనింగ్..!

పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ. డీవీవీ దానయ్య నిర్మాతగా సుజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నెల 25వ తేదీ గురువారం ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓజీ టీజర్, లిరికల్ సాంగ్స్ ఇప్పటికే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఓజీ ట్రైలర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక వారం రోజుల నుంచి ఓజీ సినిమా అప్‌డేట్స్ సోషల్ మీడియాలో టాప్‌లో ఉన్నాయి.

Also Read: కాంతారాకు షాక్.. హైకోర్ట్ నిర్ణయం ఏంటో..?

ఓజీ సినిమా సెన్సార్ పూర్తైనట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లోని థియేటర్‌లో సెన్సార్ బోర్డు సభ్యుల కోసం ఓజీ ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షో‌లో బోర్డు సభ్యులతో పాటు దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. సినిమాకు ఎలాంటి కటింగ్ లేకుండా సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ జారీ చేశారు. మొత్తం 2ి గంటల 36 నిమిషాలు సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. ఇక ఈ నెల 20న సినిమా ట్రైలర్ లాంచ్ చేసేందుకు ఓజీ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Also Read : కాంతారాకు షాక్.. హైకోర్ట్ నిర్ణయం ఏంటో..?

ఇక ఓజీ సినిమా టికెట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా 25వ తేదీ అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షో టికెట్ రూ.వెయ్యి వరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అలాగే మల్టిప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్ రేట్లు పది రోజుల పాటు పెంచుకునేందుకు సర్కార్ అంగీకరించింది. సింగిల్ స్క్రీన్ లో అయితే రూ.125, మల్టీప్లెక్స్‌లో అయితే రూ.150 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు పెంచిన ధరల ప్రకారం టికెట్లు అమ్ముకోవచ్చని వెల్లడించింది.

Also Read : నన్ను వదిలేయండి..జగన్ కు వల్లభనేని షాక్

అయితే ఓజీ టికెట్ రేట్ల పెంపుపై కూడా ఇప్పుడు కొందరు రాజకీయం చేస్తున్నారు. వారం రోజుల ముందే టికెట్ల రేటు పెంచుకోవచ్చు అని జీవో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏపీలో ఉల్లిపాయల ధరలు పడిపోతుంటే.. సినిమా టికెట్ మాత్రం రూ.వెయ్యి వసూలు చేయడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు. అయితే దీనికి పవన్ ఫ్యాన్స్ సినిమా లవర్స్ ధీటుగా జవాబిస్తున్నారు. నచ్చిన వాళ్లు టికెట్ కొంటారు.. లేదంటే.. ధరలు తగ్గిన తర్వాతే సినిమా థియేటర్లలో చూస్తారు. అంతే కానీ.. ప్రతి ఒక్కరిని టికెట్ కొనాల్సిందే అని బలవంతం చేయటం లేదు కదా.. అని సమాధానం ఇస్తున్నారు. మొత్తానికి వారం రోజులుగా సోషల్ మీడియాను ఓజీ మేనియా ఊపేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్