Saturday, October 18, 2025 07:26 PM
Saturday, October 18, 2025 07:26 PM
roots

విశ్వంభరా.. ఇక లేనట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫాన్స్ వెయిటింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడం, కొత్త సినిమాలు మొదలుపెట్టడం, కొబ్బరికాయ కొట్టడం జరుగుతోంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కాక ఫ్యాన్స్ కాస్త కంగారులో కూడా ఉన్నారు. ఇక చిరంజీవి కొత్త కథలు వింటూ, కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభరా.. సినిమా సంగతి ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు.

Also Read : అంచనాలను అందుకోలేని తెలుగు కుర్రాడు..?

ఎప్పటినుంచో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. అసలు షూటింగ్ ఏ దశలో ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ లేకుండానే.. చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టి దాదాపుగా కంప్లీట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక నవంబర్ 5 నుంచి కార్తీక పౌర్ణమి సందర్భంగా బాబి కొల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమాకు ఆరోజు గ్రాండ్ గా లాంచింగ్ ఈవెంట్ ఉంటుంది.

Also Read : మిధున్ రెడ్డిని రౌండప్ చేసిన సిట్..!

విశ్వంభరా సినిమా గురించి ఇప్పుడు ఎన్నో మాటలు చెబుతున్నా సరే.. సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆ సినిమాను పక్కనపెట్టి ఈ రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో చిరంజీవి ఉండటంతో.. వచ్చే ఏడాది వేసవిలో కూడా ఆ సినిమా రిలీజ్ కావడం కష్టమే ఉంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే సినిమా అనుకున్న విధంగా రాకపోవడంతోనే చిరంజీవి ఆసక్తి చూపించడం లేదనేది ప్రధానంగా వినపడుతున్న మాట. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీ షూటింగ్ కూడా చేశారు. మరి సినిమా రిలీజ్ సంగతేంటి అనేది క్లారిటీ రాక మెగా ఫాన్స్ లో కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్