దాదాపు నాలుగు నెలల నుంచి భారత్ ను బెదిరించే ప్రయత్నం చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భారత్ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇస్తూ వస్తోంది. తాము అమెరికాకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. సుంకాల పేరుతో అమెరికా ఎన్ని డ్రామాలు ఆడినా సరే వెనక్కు తగ్గేది లేదని ప్రధాని మోడీ, విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ ఇప్పటికే స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి.. ఇదే అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
Also Read : తమిళ నాడు స్టాలిన్, వైసీపీ చీఫ్ జగన్ కు బాంబు వార్నింగ్..!
బెదిరింపులకు భారత్ లొంగే ప్రసక్తే లేదని, భారత్ అత్యంత బలంగా ఉందని, సుంకాలను తట్టుకునే సామర్ధ్యం మన దేశానికి ఉందని తేల్చి చెప్పారు. దేశాల మధ్య సంబంధాలు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా దేశాల మధ్య వాణిజ్యంలో మార్పులు వస్తున్నాయన్నారు. భారత్ ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని, కొత్త వ్యాపార భాగస్వాములను వెతికే క్రమంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. మన పాత్ర ఇతర దేశాల్లో, సందర్భాల్లో.. నిర్ణయాలు తీసుకునే క్రమంలో.. మనకు బలమైన భాగస్వాములు ఉండాలన్నారు.
Also Read : 9 ఏళ్ళ తర్వాత.. తీరిన రాహుల్ దాహం..!
సాధ్యమైన చోట ఫలితాలను వచ్చే విధంగా ముందుకు వెళ్లాలని, లేని చోట స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలన్నారు. సంక్షోభాలు తరచుగా సరికొత్త నిర్ణయాలకు, సరికొత్త చరిత్రకు ముందు ఎదురు అవుతాయని, ఇదే చరిత్ర బోధిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని, వీటిని తట్టుకుని ముందుకు వెళ్ళే విధంగా భారత్ ను సిద్దం చేసామని తెలిపారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడు ఏ బెదిరింపులకు దేశం తలొగ్గే అవకాశం ఉండదు అన్నారు.