Sunday, October 19, 2025 09:19 PM
Sunday, October 19, 2025 09:19 PM
roots

బాబు, పీకే మీట్‌.. తాడేపల్లి ప్యాలెస్‌ షేక్‌..!!

ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల తిరుగుబాటుతో జగన్‌ కోటకు బీటలు పడుతున్నాయి. లేటెస్ట్‌గా పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ పీకే, వైసీపీ జెండా పీకేసి.. సైకిల్‌ ఎక్కడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో మినీ భూకంపం వచ్చినంత పనైంది. జగన్‌ వ్యూహాలు, రహస్యాలు బాగా తెలిసిన ప్రశాంత్‌ కిశోర్‌.. ప్రత్యర్ధితో చేతులు కలపడం, వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారనే న్యూస్‌ రాగానే.. వైసీపీ నేతల్లో కంగారు మొదలైంది.

చంద్రబాబు అరెస్టుతో, ప్రశాంత్‌ కిశోర్‌.. జగన్‌ల మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితం నుంచే పీకే, టీడీపీతో టచ్‌లోకి వచ్చారు. పార్టీ యువనేత లోకేశ్‌తో, ఐప్యాక్‌ వ్యూహకర్త ఇప్పటికే రెండు సార్లు సమావేశం జరిగింది. తాజా భేటీలో చంద్రబాబు, లోకేశ్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ ఆధిక్యంతో అధికారంలోకి వస్తుందనే భావన మెజారిటీ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో బాబు, పీకే సమావేశం ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేయడానికే ప్రశాంత్‌ కిశోర్‌ చంద్రబాబును కలిశారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్‌. ఇప్పటికే టీడీపీకి రాబిన్‌ శర్మ నేతృత్వంలోని బృందం, ఎన్నికల వ్యూహాలు అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా పీకే టీమ్‌ కూడా జాయిన్ అయితే, బాబు వ్యూహాలు మరింత పదునెక్కడం ఖాయం. మరోసారి సమావేశమైన తర్వాత.. ప్రశాంత్‌ కిశోర్‌ అఫిషియల్‌గా టీడీపీ కోసం పని చేసే అవకాశం ఉంది. టీడీపీ సోషల్‌ మీడియా ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుతో, పీకే మీటింగ్‌ గురించి తెలియగానే జగన్‌ అండ్‌ కోలో టెన్షన్‌ పెరిగిపోయింది. ఎలక్షన్‌ స్ట్రాటజిస్టే పార్టీ మార్చితే.. తాము కూడా అదే బాటలో నడవాలనే అభిప్రాయంలో ఉన్నారు మెజారిటీ వైసీపీ నేతలు. ఇంకా జగన్‌తోనే ఉంటే.. ఆయనతో పాటు మునిగిపోవాల్సి వస్తుందనే భయం కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీకి గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు పరిశీలకులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్