నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్, అరుణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దాదాపు పదేళ్ళ నుంచి ఆమె చేష్టలకు అంతు లేకుండా పోయిందనే విషయం స్పష్టంగా అర్ధమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 12 పువ్వులు 36 కాయలుగా ఆమె వ్యవహారం నడిచింది. ఆమె వ్యవహారంలో ఐపిఎస్ అధికారులు కూడా ఉండటంతో ఏపీ హోం శాఖ ఉలిక్కి పడింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఒక్కరు కాదు.. దాదాపుగా తన శక్తి సామర్ధ్యాలతో ఆమె చిన్నపాటి ప్రభుత్వాన్నే నడిపింది అని తేల్చేసారు.
Also Read : కవితకు అండగా సీనియర్లు.. కెటిఆర్ కు అడ్డు పడుతున్నారా..?
ఇటీవల ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్ట్ ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. విచారణలో కూడా సంచలన విషయాలు బయటపడినట్టు తేల్చారు. ఆమె వద్ద పోలీసుల ఆడియో, వీడియోలు కూడా ఉన్నాయని గుర్తించారు. పోలీసుల బదిలీల్లో కూడా ఆమె భాగస్వామి అని తేల్చేసారు. ఇక రౌడీ షీటర్ తో ప్రేమలో పడిన ఆమె.. అతనితో కలిసి నెల్లూరు జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలకూ పాల్పడినట్టు తేల్చేసారు. తాజాగా అతన్ని నెల్లూరు జైలు నుంచి భద్రత దృష్ట్యా విశాఖకు తరలించారు పోలీసులు.
Also Read : అంతా మా వల్లే.. క్రెడిక్ కోసం పాకులాట..!
ఇక అరుణ వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆమె బాధితుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కోవూరు నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తాను అని చెప్పి 17 మంది గిరిజనుల దగ్గర 2 లక్షలకు పైగా వసూలు చేసింది. అలాగే రౌడీ షీట్ కొట్టేయిస్తాను అని చెప్పి కొందరు రౌడీల దగ్గర శ్రీకాంత్ సలహాతో ఆమె డబ్బులు తీసుకున్నట్టు గుర్తించారు. ఇక పోలీసులకు సైతం బదిలీలు చేయిస్తాను అని చెప్పి.. డీఎస్పీ స్థాయి అధికారుల వద్ద భారీగా వసూలు చేసినట్టు గుర్తించారు.