వాట్సాప్” ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితం, క్రీడలు.. ఇలా ఏ రంగంలో చూసినా సరే దీని పాత్ర అత్యంత కీలకం. రోజు రోజుకి దీని ప్రాధాన్యత పెరుగుతుందే గాని తగ్గడం లేదు. ఇక మెటా యాజమాన్యం కూడా వాట్సాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో కీలక అప్డేట్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది వాట్సాప్ యాజమాన్యం. వాట్సాప్ ప్రస్తుతం ఒక ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది, తద్వారా యూజర్లు తాము ఓపెన్ చేయని మెసేజ్ లును బ్లాక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
Also Read : ఆసుపత్రిలో రేణు దేశాయ్..!
యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అడుగులు వేస్తోంది. ఓపెన్ చేయని కాంటాక్ట్ లు లేదా బిజినెస్ యాప్స్ నుంచి వచ్చే మెసేజ్ లను పరిమితం చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీకు ఎవరైనా మేసేజే చేస్తే.. ఒక లిమిట్ దాటి అదే పనిగా మీకు మెసేజ్ లు వస్తుంటే.. మీరు ఓపెన్ చేసే వరకు తర్వాతి మెసేజ్ లు రావు. ఓపెన్ చేసే వరకు డెలివరి కాకుండా ఆగిపోతాయి. తాత్కాలికంగా వారి మెసేజ్ లను బ్లాక్ చేస్తుంది. మళ్ళీ మీరు ఆ చాట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మెసేజ్ లు వస్తాయి.
Also Read : ప్రాణాలు కోల్పోయిన యువ క్రికెటర్లు..!
స్పాం మెసేజ్ లు కారణంగా యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. పదే పదే మెసేజ్ లు రావడంతో అవసరమైన మెసేజ్ లు చూడటం కష్టంగా మారుతూ ఉంటుంది. అందుకే ఈ ఫీచర్ ను తీసుకొస్తున్నారు. బిజినెస్ మార్కెటింగ్ కు సంబంధించి బల్క్ మెసేజ్ లు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వినియోగదారులు అన్ సబ్‌స్క్రైబ్ చేసుకునే ఫీచర్ ఇచ్చినా సరే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీనితో సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. వాట్సాప్ ఇప్పటికే ప్రతి నెలా మిలియన్ల ఖాతాలను నిషేధిస్తోంది. 2025 మొదటి అర్ధభాగంలోనే స్కామ్ సెంటర్స్ తో ముడిపడి ఉన్న 6.8 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించిందని పేర్కొంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని సమాచారం.