Tuesday, March 24, 2026 06:47 PM
Tuesday, March 24, 2026 06:47 PM

దేశంలో సీట్ల పెంపు సందడి.. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పండగ..!

భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ మరియు అసెంబ్లీ స్థానాలను భారీగా పెంచాలని ఎన్డీయే సర్కార్ నిర్ణయించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న స్థానాలను ఏకంగా 50 శాతం మేర పెంచబోతున్నారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో కేంద్రం ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది. లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్ల నుంచి ఏకంగా 816కి చేరనున్నాయి.

Also Read : కామెడి పీస్ అయిపోతున్న ట్రంప్.. ఇవేం మూడ్ స్వింగ్స్ ప్రెసిడెంట్ సాబ్..?

దేశంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు కూడా భారీగా పెరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4,123 సీట్లు కాస్తా 6,185కి పెరగనున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నేతలకు అవకాశం దక్కనుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి చేరనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.

Also Read : బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న లోకేష్.. కేంద్ర హోంశాఖ గుడ్ న్యూస్..!

అంతా అనుకున్నట్లు జరిగితే, 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే ఈ పెరిగిన స్థానాలతో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా పాలనను మరింత ప్రజలకు చేరువ చేయవచ్చని కేంద్రం వాదిస్తోంది. సీట్ల సంఖ్య 50 శాతం పెరుగుతుండటంతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాలు చిన్నవిగా మారడం వల్ల అభ్యర్థులకు ప్రజలతో సంబంధాలు పెంచుకోవడం సులభతరం అవుతుంది. అయితే, ఈ మార్పుల వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే వాదనల నేపథ్యంలో, దక్షిణాది రాష్ట్రాల స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్