Friday, September 12, 2025 04:56 PM
Friday, September 12, 2025 04:56 PM
roots

అన్ని ఉత్త ప్రగల్భాలేనా..?

దమ్ముంటే పట్టుకోరా షికావత్తు.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు.. అనేది ఫుష్ప సినిమా డైలాగ్. ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది కూడా. తప్పు చేసిన వాడిని పట్టుకోవటం పోలీసులకు పెద్ద సవాల్. అవును నేను తప్పు చేశా.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నా.. దమ్ముంటే పట్టుకో.. అని జిల్లా ఎస్పీకి సవాల్ విసిరాడు పుష్ప. అయితే పుష్ప చేసే అక్రమ వ్యాపారాన్ని పట్టుకునేందుకు ఎస్పీ నానా పాట్లు పడాల్సి వస్తుంది. ఇదంతా సినిమా. కానీ రియల్ లైఫ్ ‌లో అయితే.. తప్పు చేసిన వాళ్లను పట్టుకోవడానికి సాక్ష్యం, కేసు ఉంటే చాలు. ఎలాంటి వారినైనా సరే వెంటనే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టవచ్చు. కానీ ఏపీలో ప్రస్తుతం ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిని అరెస్టు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అటు సదరు మాజీ కూడా.. అరెస్టు చేసుకో.. జైలుకు పోతా అంటున్నారు.. అదే సమయంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు.

Also Read :మార్పు ఖాయం.. వేటు వారిపైనేనా..?

కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో మహిళా ప్రజాప్రతినిధి అనే కనీస సంస్కారం కూడా లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేశారు. దీంతో ప్రశాంతి రెడ్డి అభిమానులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు ధ్వంసం చేశారు. మహిళా కమిషన్ ఛైర్మన్ కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఈ విషయంపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తాను ఇంట్లో లేని సమయంలో ఇలా దాడి చేశారని… ఈ దాడి వెనుక వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఏం జరిగినా సరే.. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామన్నారు. వాటిని వెనక్కితీసుకునేది లేదని స్పష్టం చేశారు. అటు ప్రశాంతి రెడ్డి మాత్రం.. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు.

Also Read :భారత్ కు ఊహించని దెబ్బ.. మూడో టెస్ట్ లో పంత్ కష్టమే..?

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ ఎంపీ పురందేశ్వరి, సీఎం సతీమణి భువనేశ్వరి సహా మహిళా లోకం మొత్తం డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా తాను అరెస్టుకు భయపడేది లేదని తేగేసి చెప్పారు. వచ్చి అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు. ఇదంతా మీడియా ముందే. వైసీపీ నేతలంతా మైకుల ముందు మాత్రమే పులులు. తేడా వస్తే మాత్రం.. సైలెంట్‌గా పారిపోతారు. కాకాణి గోవర్థన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని.. ఇలా ఒకరేమిటి.. చాలా మంది ఇదే కోవకు చెందిన వాళ్లు. అరెస్టు చేస్తారనే భయంతోనే కాకాణి రెండు నెలలు అజ్ఞాతంలో ఉన్నారు. చెవిరెడ్డి కొలంబో పారిపోయేందుకు ప్లాన్ చేశారు. పేర్ని నాని సైలెంట్‌గా సైడ్ అయ్యారు. కొడాలి నాని ముంబై వయా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అదే జాబితాలో చేరిపోయారు.

Also Read : ముందుగా క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా? ప్రాణాలను రక్షించే కీలక సమాచారం

దమ్ముంటే అరెస్టు చేసుకోండి.. మా కాకాణితో కలిసి జైలులో సరదాగా గడిపేస్తా అని మీడియా ముందు గొప్పగా చెప్పారు ప్రసన్నకుమార్ రెడ్డి. దాడి అనంతరం మీడియా ముందుకు వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. జైలుకు వెళ్లడానికి సిద్ధమేనన్నారు. కానీ తీరా కేసులు నమోదు కావడంతో అరెస్టు ఖాయమనే భయంతో.. వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారు.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రసన్నకుమార్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసుకోండి పర్లేదు అంటూ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు కదా.. మరి ముందస్తు బెయిల్ ఎందుకు మీకు. హాయిగా జైలులో కృష్ణా రామా అనుకోవచ్చు కదా.. అని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్