Tuesday, October 28, 2025 05:03 AM
Tuesday, October 28, 2025 05:03 AM
roots

హైదరాబాద్ నవాబ్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా..!

మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఒకప్పుడు అతన్ని తిట్టిన వాళ్ళే అతని కమిట్మెంట్ చూసి ఫిదా అయిపోతున్నారు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్న టైం లో జట్టులోకి వచ్చిన సిరాజ్.. అప్పటి నుంచి జట్టుకి ప్రతీ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్ట్ ల సీరీస్ కు, ఆస్ట్రేలియా పర్యటనకు, ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు ప్రతీ మ్యాచ్ కు అందుబాటులో ఉన్నాడు.

Also Read : రెండు తప్పులు సీరీస్ ను ముంచాయా..?

ఆస్ట్రేలియా టూర్ లో 5 మ్యాచ్ లు ఆడిన సిరాజ్, ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ లో కూడా 5 మ్యాచ్ లు ఆడాడు. బూమ్రా మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. కాని సిరాజ్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఫిట్నెస్ కారణంగా, వర్క్ లోడ్ కారణంగా తప్పుకోలేదు. బూమ్రా లేని సమయాల్లో జట్టుకు అత్యంత కీలకంగా మారుతున్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న సీరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు సిరాజ్. మొత్తం 18 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.

Also Read : టీంలో ఆ ఒక్కడికే ఎందుకీ ఈ అన్యాయం..?

మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో 157 ఓవర్లు వేసిన సిరాజ్, ఈ సీరీస్ లో 156 ఓవర్లు వేసాడు. రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ కీలకం కానున్నాడు. దీనితో అతనిని ఇండియన్ పేస్ అటాక్ కు లీడర్ అంటూ కొనియాడుతున్నారు ఫ్యాన్స్. ప్రపంచ క్రికెట్ లో ఇంత కంటిన్యూగా మ్యాచ్ లు ఆడుతున్న బౌలర్ మరొకరు లేరు. ఆస్ట్రేలియా సీరీస్ లో సిరాజ్ పై విమర్శలు వచ్చినా, ఇంగ్లాండ్ టూర్ లో మాత్రం సత్తా చాటుతున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్