అమరావతి పునర్‌నిర్మాణ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా.. ఒక స్వప్నం సాకరం కాబోతుంది అంటూ భావోద్వేగ ప్రసంగం చేసారు. దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాను అన్నారు. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదులన్నారు మోడీ.
Also Read : ఆ విషయంలో జగన్ స్టాండ్ క్లియర్..!
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు అంటూ మొదలుపెట్టి.. ఇంద్రలోకం రాజధాని.. అమరావతి అంటూ కొనియాడారు. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే అని.. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమన్నారు. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి .. అమరావతని కొనియాడారు. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారుతుందన్నారు.
Also Read : లోకేష్ పదవిపై ఫుల్ క్లారిటీ..!
హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతని, అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తుందని స్పష్టం చేసారు. టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారన్నారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానని.. అధికారులను పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించానని పేర్కొన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమన్నారు మోదీ.
Also Read : షర్మిలకు ఉన్న ధైర్యం జగన్ కు లేదా..?
పెద్దపెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరని.. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశాను అన్నారు. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందని.. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించిందన్నారు మోదీ. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుందని స్పష్టం చేసారు. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఎన్టీఆర్.. వికసిత ఏపీ కోసం కలలుగన్నారని.. మనందరం కలిసి ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలని పిలుపునిచ్చారు.




